Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?

  • కోల్‌కతాలోని చోర్‌బాగన్ దుర్గా పూజ పండల్ వద్ద తొక్కిసలాట
  • ఈ ఘటనలో కనీసం 17 మంది మృతి చెందినట్లు సమాచారం పలువురికి గాయాలు.. ఆసుపత్రులకు తరలింపు
Kolkata

Kolkata

Kolkata: పండగ వేళ పశ్చిమ బెంగాల్‌‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రాజధాని కోల్‌కతాలోని ఓ దుర్గా పూజా మండపం వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 17 మంది మరణించినట్లు తెలుస్తోంది. 30 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రుల్ని ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. శనివారం ఉత్తర కోల్‌కతాలోని చోర్‌బాగన్ సార్వజనిన్ దుర్గా పూజ పండల్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.

ప్రమాద సమాచారం అందుకున్న సీఎం సువేందు అధికారి, రాష్ట్ర సీఎస్ మనోజ్ అగర్వాల్ పరిస్థితిని సమీక్షించేందుకు కలకత్తా మెడికల్ కాలేజీకి చేరుకున్నారు. ఈ ఘటనపై మాజీ సీఎం మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని, బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ఘటన సమయంలో మండపం వద్ద ఒక్కసారిగా రద్దీ పెరగడంతో ఈ ఘటన జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. క్షతగాత్రుల్లో చాలా మందిని బైకులపై ఆస్పత్రులకు తరలించారు. మండపంలోకి ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలు చాలా ఇరుకుగా ఉండటంతోనే ప్రమాద తీవ్రత పెరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.