NTV Telugu Site icon

Rajasthan: కొంపముంచిన సవాల్.. మంత్రి పదవికి లాల్ మీనా రాజీనామా

Modi

Modi

రాజస్థాన్ మంత్రి కిరోడి లాల్ మీనా (72) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుని కేబినెట్ పదవిని త్యాగం చేశారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా లాల్ మీనా సవాల్ విసిరారు. దౌసాతో సహా పలు కీలక లోక్‌సభ స్థానాల్లో బీజేపీ ఓడిపోతే మంత్రివర్గం నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. తీరా చూస్తే.. మంత్రి సవాల్ విసిరిన స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. దీంతో ఇచ్చిన మాటకు కట్టుబడి మంత్రి పదవికి మీనా రాజీనామా చేశారు.

ఇది కూడా చదవండి: Nadendla Manohar: విలువలతో కూడిన రాజకీయాలు.. ప్రజలకు మార్పు చూపించాలనే మా ఆలోచన

రాజస్థాన్‌లోని 25 లోక్‌సభ స్థానాలకు గాను 14 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. కిరోడి లాల్ మీనా సవాల్ విసిరిన దౌసాతో సహా 8 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. తనకు అప్పగించిన ఏడు లోక్‌సభ స్థానాల్లో దేనినైనా ఓడిపోతే రాజీనామా చేస్తానని హామీ ఇచ్చారు. ఆ మేరకే మీనా మంత్రి పదవికి రాజీనామా చేశారని ఆయన సహాయకుడు గురువారం వెల్లడించారు. 10 రోజుల క్రితమే రాజీనామా పత్రాన్ని ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ శర్మకి సమర్పించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మీనా వ్యవసాయం మరియు ఉద్యానవనం, గ్రామీణాభివృద్ధి, విపత్తు నిర్వహణ, పౌర రక్షణ మరియు పబ్లిక్ ఛార్జ్ రిజల్యూషన్‌తో సహా అనేక పోర్ట్‌ఫోలియోలను నిర్వహించారు. గత ఏడాది జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మీనా సవాయి మాధోపూర్ నుంచి గెలుపొందారు. బీజేపీకి 200 నియోజకవర్గాల్లో 115 సీట్లు వచ్చాయి.

ఇది కూడా చదవండి: Darshan Wife: నాకు, నా కొడుక్కి ఎలాంటి ఇబ్బంది రావొద్దు.. కమిషనర్‌కు దర్శన్ భార్య లేఖ!