NTV Telugu Site icon

Khalistan: ఖలిస్తానీ ఉగ్రవాదుల్ని వరసగా లేపేస్తున్నారు.. యూకే, పాక్, కెనడాల్లో ఘటనలు.. వీటి వెనక “రా” ఉందా..?

Khalistan

Khalistan

Khalistan: ఇటీవల కాలంలో ఖలిస్తానీ వేర్పాదువాద శక్తులు నానా హంగామా చేస్తున్నాయి. ముఖ్యంగా కెనడా, యూకే, ఆస్త్రేలియా దేశాల్లో భారత వ్యతిరేక కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. దీంతో పాటు ఇండియాలో ఉన్న ఖలిస్తానీ గ్రూపులకు ఆర్థికంగా సాయం చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. కాగా ఇదిలా ఉంటే ఇటీవల పలువురు ఖలిస్తానీ ఉగ్రవాదుల్ని అనుమానిత వ్యక్తుల వరసగా చంపేస్తున్నారు. తుపాకీతో తక్కువ దూరం నుంచి కాల్చేసి పరారవుతున్నారు. పాకిస్తాన్ తో పాటు యూకే, కెనడాల్లో పలువురు ఖలిస్తానీ ఉగ్రవాదుల్ని హతమార్చారు. నెల వ్యవధిలో ముగ్గురు కీలక ఖలిస్తాన్ ఉగ్రవాదులు చంపివేయబడ్డారు.

నిన్న ‘ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్’ చీఫ్ గా ఉన్న హర్దీప్ సింగ్ నిజ్జర్ ను కెనడాలో అతి సమీపం నుంచి కాల్చి చంపారు. పంజాబీలు ఎక్కువగా ఉండే సర్రేలో ఓ గురుద్వారా వద్ద కాల్చి చంపారు. ఇతను భారత్ కు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా ఉన్నాడు. అంతకుముందు వారం రోజుల క్రితం ఖలిస్తాన్ వేర్పాటువాది యూకేలో ఉంటున్న అవతార్ సింగ్ ఖండా బర్మింగ్ హామ్ లోని ఓ ఆస్పత్రిలో అనుమానాస్పద రీతిలో చనిపోయారు. ఇటీవల అమృత్ పాల్ సింగ్ అరెస్ట్ నేపథ్యంలో లండన్ లోని భారత రాయబార కార్యాలయంపై దాడి చేసి, జాతీయ జెండాను కిందికి దించి, ఖలిస్తాన్ జెండాను ఎగరేసేందుకు ప్రయత్నించాడు. ఇది జరిగిన కొన్ని రోజులకే ఇతను మరణించాడు.

READ ALSO: Renault Rafale SUV: రోడ్డుపై దూసుకెళ్లనున్న రాఫెల్.. SUV నుంచి కొత్త కారు.. ఫీచర్లు చూస్తే మైండ్‌ బ్లాకే

అంతకుముందు మే 6న పాకిస్తాన్ లాహోర్ కేంద్రంగా ఖలిస్తాన్ ఉగ్రవాద సంస్థ అయిన ‘ఖలిస్తాన్ కమాండో ఫోర్స్’ చీఫ్ పరమ్ జిత్ సింగ్ పంజ్వార్ ను గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. లాహోర్‌లోని అతని ఇంటి దగ్గర మార్నింగ్ వాక్ చేస్తున్నప్పుడు కాల్చి చంపబడ్డాడు. పంజ్వార్ ఖలిస్తాన్ కమాండో ఫోర్స్ కీలక నాయకుడు. 1960లో పంజాబ్ లోని తరన్ తరన్ లో జన్మించాడు. జూలై 2020లో ఇతడిని ఉపా చట్టం కింద ఉగ్రవాదిగా భారత ప్రభుత్వం ప్రకటించింది. దీనికి ముందు 2020లో హ్యాపీ పీహెచ్‌డీగా పిలువబడే హర్మీత్ సింగ్ లాహోర్ సమీపంలో కాల్చి చంపబడ్డాడు. ఇతను ఖలిస్తాన్ లిబరేషన్ ఫోర్స్ మాడ్యుల్స్ కి శిక్షణ ఇవ్వడంలో కీలకంగా వ్యవహరించేవాడు.ఖలిస్తాన్ పేరుతో హింసకు పాల్పడుతున్న వాధావా సింగ్ బబ్బర్, లఖ్‌బీర్ సింగ్ రోడ్, రంజీత్ సింగ్ నీతా, భూపిందర్ సింగ్ భిండా, గుర్మీత్ సింగ్ బగ్గా , గురుపత్వంత్ సింగ్ పన్నూన్, పరమజిత్ సింగ్ పమ్మా, అర్ష్‌దీప్ సింగ్ గిల్ అలియాస్ అర్ష్ దాలా , హర్విందర్ సింగ్ సంధు వంటి వారు భారత్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నారు.

‘రా’ హస్తం ఉందా..?

అయితే ఇలా వరసగా భారత వ్యతిరేక ఉగ్రవాదులు చంపబడటం వెనక భారత నిఘా సంస్థ రీసెర్చ్ అనాలిసిస్ వింగ్(RAW) హస్తం ఉందా..? అనే అనుమానాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. వీరితో పాటు అంతకుముందు ఇస్లామిక్ జిహదీ శక్తులు కూడా ఇలాగే పాకిస్తాన్ లో హతమార్చవేయబడ్డారు. హతమైన వారు జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదాన్ని దీంతో ఈ అనుమానాలు బలపడుతున్నాయి. మన దేశానికి వ్యతిరేకంగా ఉండీ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని రా అంతం చేస్తుందనే అనుమానం కలుగుతోంది.