Khalistan: ఇటీవల కాలంలో ఖలిస్తానీ వేర్పాదువాద శక్తులు నానా హంగామా చేస్తున్నాయి. ముఖ్యంగా కెనడా, యూకే, ఆస్త్రేలియా దేశాల్లో భారత వ్యతిరేక కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. దీంతో పాటు ఇండియాలో ఉన్న ఖలిస్తానీ గ్రూపులకు ఆర్థికంగా సాయం చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. కాగా ఇదిలా ఉంటే ఇటీవల పలువురు ఖలిస్తానీ ఉగ్రవాదుల్ని అనుమానిత వ్యక్తుల వరసగా చంపేస్తున్నారు. తుపాకీతో తక్కువ దూరం నుంచి కాల్చేసి పరారవుతున్నారు. పాకిస్తాన్ తో పాటు యూకే, కెనడాల్లో పలువురు ఖలిస్తానీ ఉగ్రవాదుల్ని హతమార్చారు.…