Kerala Couple: అబ్బాయి.. తండ్రి కాబోతున్నాడు అనడానికి.. అబ్బాయి బిడ్డకు జన్మనిస్తున్నాడు అనడానికి చాలా తేడా ఉంది.. మనం ఇప్పుడు మాట్లాడుకుంటుంది కచ్చితంగా అబ్బాయి బిడ్డకు జన్మనిస్తున్నాడు అనే దాని గురించే.. వినగానే ఏంటి.. ఇదెక్కడి విడ్డూరం.. అబ్బాయి బిడ్డకు జన్మనేలా ఇస్తాడు.. అని ఆశ్చర్యపోకండి.. కేరళలో ఒక ట్రాన్స్ జెండర్ కపుల్.. తమ కళను సాకారం చేసుకోబోతున్నారు. నిజంగానే ఒక అబ్బాయి.. ప్రెగ్నెంట్ అయ్యాడు. ఎలా.. అంటే.. కేరళకు చెందిన జహద్ ఒక అమ్మాయి. చిన్నతనం నుంచి ఆమెకు అమ్మాయిలంటే ఆకర్షణ ఉండేది. దీంతో ఆమె ట్రాన్స్ జెండర్ గా మారింది. ఇక మరోపక్క జియా.. ఒక అబ్బాయి.. అతనికి చిన్నతనం నుంచి అబ్బాయిలు అంటే కోరిక ఉండేది. దీంతో అతను.. ఆమెగా మారాడు. జియా, జహాద్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అందరి తల్లిదండ్రులను చూసి వారు కూడా తల్లిదండ్రులు కావాలని ఆశపడ్డారు. ఎంతోమంది వద్ద బిడ్డను దత్తతను తీసుకోవడానికి ప్రయత్నించినా తాము ట్రాన్స్ జెండర్స్ అని ఇవ్వడం లేదని వారు చెప్పుకొచ్చారు.
Read Also: Live Incident: తెల్లారితే ఎగ్జామ్.. కష్టపడి చదివాడు.. కళ్లెదుటే చనిపోయాడు
ఇక ఆ సమయంలోనే జహాద్ ఇంకా అమ్మాయే అని గుర్తుచేసుకున్నారు.. అమ్మాయి నుంచి అబ్బాయిగా మారే క్రమంలో ఆమె వక్షోజాలను మాత్రమే తీశారు తప్ప గర్భాశయాన్ని ఇంకా తీయలేదు. దాన్ని తీసేలోపు అతడు గర్భం దాల్చాడు. ఇక పిల్లలు కావాలనే వారి కోరిక నెరవేరుతుండడంతో దాన్ని కంటిన్యూ చేసారు. ఇప్పుడు అతడికి తొమ్మిది నెలలు నిండాయి.. వచ్చే నెలలో అతడు బిడ్డకు జన్మనివ్వబోతున్నాడు. ఎంత అమ్మాయిగా ఉన్నా బిడ్డకు జన్మనివ్వడం లేదు అనే బాధ ఉండేదని, దాన్ని జహద్ తీర్చాడని.. త్వరలోనే తమ బిడ్డ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నట్లు జియా చెప్పుకొచ్చింది. ఇలా దేశంలోనే మొదటిసారి ఒక అబ్బాయి.. ప్రెగ్నెంట్ అయ్యి.. బిడ్డకు జన్మనివ్వబోతున్నాడు.
Read Also:Treat Pneumonia: న్యుమోనియా చికిత్స.. 3 నెలల పాపను వేడిరాడ్‌తో 51 సార్లు కొట్టి..