Site icon NTV Telugu

Lesbian couple photoshoot: లెస్బియన్ జంట వెడ్డింగ్ ఫోటో షూట్.. అసలు మామూలుగా లేరుగా..!

Lesbian Couple Photoshoot

Lesbian Couple Photoshoot

Kerala lesbian couple pose as brides for wedding photoshoot: ఇద్దరు మహిళలు ఇష్టపడ్డారు. ఒకరినొకరు ప్రేమించుకున్నారు. చిన్న వయసులో ప్రేమ పెరుగుతూ పెద్దదైంది. చివరకు ఇద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఇంట్లో పెద్దలు వద్దంటున్నా.. వారిని ఎదురించి ఒకటి కావాలని అనుకుంటున్నారు. అయితే తమ వివాహం ముందు గ్రాండ్ గా ఫ్రీ వెడ్డింగ్ షూట్ నిర్వహించారు. దీంట్లో ఇద్దరు యువతులు తమ ఇచ్చిన ఫోజులు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. తమ వెడ్డింగ్ షూట్‌కు సంబంధించి ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో పంచుకున్నారు.

Read Also: Gujarat Elections: కాంగ్రెస్ ఎన్నికల ర్యాలీలో ఎద్దు హల్చల్.. బీజేపీపై ఆరోపణలు

కేరళకు చెందిన ఆదిలా నసరిన్, ఫాతిమా నూరా అనే లెస్బియన్ జంట మళ్లీ వార్తల్లోకి వచ్చారు. గతంలో ఈ జంటను ఇరు కుటుంబాలు వేరు చేశాయి. అయితే కేరళ హైకోర్టు తీర్పుతో వీరిద్దరు కలిశారు. ఫాతిమాను కలుసుకోనివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆదిలా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు తీర్పుతో వీరిద్దరు ఒకటయ్యారు. అయితే మేము ఇంకా వివాహం చేసుకోలేదని..కానీ కలిసి ఉండాలని కోరుకుంటున్నామని ఆదిలా అన్నారు. ఈ జంటను ఫాతిమా కుటుంబం బెదిరించింది. ఇప్పటికీ బెదిరింపులను ఎదుర్కొంటున్నారు. పాఠశాల నుంచి వీరిద్దరు సన్నిహితంగా ఉంటున్నారు. హైస్కూల్ వరకు కలిసే చదువుకున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. తాజాగా మరోసారి ఈ వెడ్డింగ్ షూట్ తో మరోసారి చర్చనీయాంశంగా మారింది ఈ లెస్బియన్ జంట.

Exit mobile version