NTV Telugu Site icon

MA Baby: సీపీఎం కొత్త ప్రధాన కార్యదర్శిగా ఎంఏ బేబీ.. ఆయన నేపథ్యం ఇదే..

Ma Baby

Ma Baby

MA Baby: సీపీఎం పార్టీ కొత్త ప్రధాన కార్యదర్శిగా కేరళకు చెందిన ఎంఏ బేబీని ఎన్నుకున్నారు. 71 ఏళ్ల బేబీ సీపీఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు. తమిళనాడు మధురైలో జరిగిన సీపీఎం 24వ పార్టీ కాంగ్రెస్‌లో ఎంఏ బేబీని పార్టీ చీఫ్‌‌గా ఎన్నుకున్నారు. కేరళ నుంచి పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన రెండో వ్యక్తిగా ఈయన నిలిచారు. అంతకుముందు కేరళ మొదటి ముఖ్యమంత్రి ఈఎంఎస్ నంబూద్రిపాల్ సీపీఎంకు నాయకత్వం వహించారు. గతేడాది సీతారాం ఏచూరి మరణం తర్వాత ఈ పదవి ఖాళీగా ఉంది. తాత్కాలికంగా ప్రకాష్ కారత్ పదవిని నిర్వహిస్తున్నాడు. మైనారిటీ కమ్యూనిటీ నుంచి సీపీఎం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తొలి నేతగా బేబీ రికార్డ్ సృష్టించారు.

Read Also: Sambhal: సంభాల్ మసీదు వద్ద పోలీస్ అవుట్‌పోస్ట్.. ప్రారంభించిన 8 ఏళ్ల బాలిక..

కేరళలో అధికారి సీపీఎం పార్టీలో బేబీ సీనియర్ నేతగా ఉన్నారు. ఈయన గతంలో 2006-2011 వరకు కేరళ విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 1986-1998 మధ్య రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన బేబీకి కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీని విజయవంతంగా నడిపిస్తారని ఆకాంక్షించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి కూడా శుభాకాంక్షలు తెలిపారు. కేరళలోని కొల్లాం జిల్లాలో జన్మించిన ఎంఏ బేబీ విద్యార్థి దశ నుంచే సీపీఎం పార్టీతో సంబంధం ఉంది. పార్టీలో వివిధ స్థాయిల్లో ఆయన పనిచేశారు. పార్టీ స్టూడెంట్ వింగ్ ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐలో కీలక పదవులు నిర్వహించారు.

పార్టీ చీఫ్‌తో సహా 85 మంది సభ్యుల కొత్త కేంద్ర కమిటీని కూడా ఎన్నుకున్నారు. ఇది 18 మంది సభ్యుల పోలిట్ బ్యూరోని ఎన్నుకుంది. కొత్తగా ఎన్నికైన పోలిట్ బ్యూరోలో పినరయి విజయన్‌తో పాటు సీనియర్ నేతలు బివి రాఘవులు, తపన్ సేన్, నీలోత్పల్ బసు, ఎండీ సలీం, ఎ విజయరాఘవన్, అశోక్ ధావలే, రామచంద్ర డోమ్, ఎంవి గోవిందన్, అమ్రా రామ్, విజూ కృష్ణన్, మరియం ధావలే, యు వాసుకిత్, కె బాలకృష్ణన్, అరుణ్ దీప్, చోవుద్దాచ్, జె.బాలకృష్ణన్, ఎంఏ బేబీ ఉన్నారు.