Sabarimala: కేరళ రాష్ట్రంలోని ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రం శబరిమలలో ప్లాస్టిక్ వినియోగంపై హైకోర్టు కఠిన ఆదేశాలు జారీ చేసింది. ప్లాస్టిక్ షాంపూ సాచెట్లు, సబ్బులు విక్రయించడం, వాడటం పూర్తిగా నిషేధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. పంబా నదిలో విపరీతంగా ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయనే ఆందోళనను వ్యక్తం చేసిన కోర్టు, ఈ సమస్య పర్యావరణానికి హాని కలిగిస్తోందని పేర్కొనింది. దీనిని దృష్టిలో పెట్టుకుని డివిజన్ బెంచ్ ఈ నిషేధాన్ని విధిస్తున్నట్లు ప్రకటించింది. .
Read Also: Crime News: లెస్బియన్ అఫైర్..! కన్న కొడుకునే చంపేసిన మహిళ..
ఇక, ట్రావెన్‌కోర్ దేవస్వోమ్ బోర్డు ఈ ఆదేశాలను కఠినంగా అమలు చేయాలని హైకోర్టు వెల్లడించింది. అలాగే, పంబా, సన్నిధానం, ఎరుమేలి ప్రాంతాల్లో రసాయన కుంకుమ అమ్మకాలు కూడా నిషేధించినట్లు తెలిపారు. ఎందుకంటే అవి పర్యావరణానికి హానికరమని పేర్కొనింది. రాబోయే మండల- మకరవిళక్కు సీజన్ నవంబర్ 16వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుంది. అప్పటి నుంచే న్యాయస్థానం ఆదేశాలు అమల్లోకి రానున్నాయి. ఘన వ్యర్థాల పారవేతను నిరోధించేందుకు ఎరుమేలి గ్రామ పంచాయతీ తనిఖీలు చేపట్టాలని కూడా చెప్పుకొచ్చింది. న్యాయస్థానం నిర్ణయంతో శబరిమల పరిసరాల్లో పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉందన్నారు.