NTV Telugu Site icon

Amit Shah: కేరళ విలయంపై రాజ్యసభలో అమిత్ షా కీలక ప్రకటన

Amitshahrajya Sabha

Amitshahrajya Sabha

కేరళ విలయంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో స్పందించారు. వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడగానికి వారం రోజుల ముందే కేరళలోని పినరయ విజయన్ ప్రభుత్వాన్ని హెచ్చరించినట్లు అమిత్ షా స్పష్టం చేశారు. కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని కేరళ ప్రభుత్వానికి జులై 23న ముందస్తు హెచ్చరికలు చేసిందని అమిత్ షా రాజ్యసభలో పేర్కొన్నారు. ముందు చర్యల్లో భాగంగా తొమ్మిది ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను కేరళకు పంపించామని.. కేరళ ప్రభుత్వం సకాలంలో ప్రజలను తరలించలేదని అమిత్ షా రాజ్యసభలో ఆరోపించారు. ప్రకృతి వైపరీత్యాల గురించి కనీసం ఏడు రోజుల ముందుగానే హెచ్చరికలు ఇవ్వగల నాలుగు దేశాల్లో భారతదేశం ఒకటి అని గుర్తుచేశారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాల రాకతో కేరళ ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటే మరణాల సంఖ్య తగ్గి ఉండేదని చెప్పారు. కేంద్రం.. కేరళ రాష్ట్రానికి అండగా ఉంటామని.. అంతేకాకుండా ప్రధాని మోడీ ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నారని చెప్పారు.

ఇది కూడా చదవండి: Telangana: నాగదేవత అంటూ ఏళ్లుగా పూజలు.. చివరకు ఆ పాము కాటుతోనే మృతి..

మంగళవారం వాయనాడ్ జిల్లాలో సంభవించిన కొండచరియలు విరిగిపడటంతో 204 మందికి పైగా మరణించారు. మరో 200 మంది గాయపడ్డారు. గల్లంతైన 180 మంది కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇంకోవైపు వాలంటీర్లు కూడా సాయం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: CM Chandrababu: మదనపల్లి ఫైల్స్ ఘటనపై సీఎం చంద్రబాబును కలిసిన సీపీఐ బృందం