Kejriwal: సనాతనం అంటే అధికారం.. డబ్బేనా? అయోధ్య స్కామ్‌లో బీజేపీపై కేజ్రీవాల్ విమర్శలు
- సనాతనం అంటే అధికారం.. డబ్బేనా?
- అయోధ్య స్కామ్‌లో బీజేపీపై కేజ్రీవాల్ విమర్శలు
- జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నిందితులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా అయోధ్య రామాలయ విరాళాల వివాదం కుదిపేస్తోంది. కోట్లాది రూపాయల విరాళాలు దారి మళ్లడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దాదాపు రూ.200 కోట్ల స్కామ్ జరిగినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు.. కేంద్ర ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ సందర్భంగా ఆప్ అధినేత కేజ్రీవాల్… కేంద్రానికి, ఉత్తరప్రదేశ్ బీజేపీ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు. కుంభకోణంతో దేశంలోని ప్రతి సనాతని మనస్తాపానికి గురయ్యారని పేర్కొన్నారు.
బుధవారం మీడియాతో మాట్లాడిన కేజ్రీవాల్.. “రామాలయ విరాళాల కుంభకోణం దేశంలోని ప్రతి సనాతని హృదయాన్ని బాధించింది. ఇప్పటివరకు బయటపడింది మంచుకొండలో చిన్న భాగం మాత్రమే. ఇంకా చాలా విషయాలు బయటకు రావాల్సి ఉంది. బీజేపీ సనాతనాన్ని కేవలం అధికారం, డబ్బు కోసం మాత్రమే ఉపయోగించుకుంది” అని ఆరోపించారు. దేశంలో సనాతన ధర్మంపై నిజమైన విశ్వాసం ఉన్న పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రమేనని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ప్రజలకు ఉచిత తీర్థయాత్రలు నిర్వహించామని.. పంజాబ్‌లో కాళీమాత, లవకుశ్ ఆలయాల నిర్మాణానికి కృషి చేస్తున్నామని.. భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అవినీతి రహిత పాలన అందించడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంటున్నామని అన్నారు.
Also Read
- Gargi story Explained: నరమేధపు నేలపై పూసిన గులాబీ! 200 ఏళ్ల తర్వాత ఆ గ్రామంలో పుట్టిన తొలి ఆడపిల్ల!
- UNEP: భారత్‌కు బిగ్ అలర్ట్! విపత్తులు ముంచుకొస్తున్నాయా?
- IndiGo Plane Hits Pole: ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానానికి ప్రమాదం.. పోల్‌ను ఢీకొన్న ఫ్లైట్!
- Indian Air Force: పాక్ బోర్డర్లో గర్జనకు సిద్ధమౌతున్న భారత వాయుసేన.. బిగ్ వార్ ప్రిపరేషన్‌కి రెడీ!
అమిత్ షాపై ప్రశ్నల వర్షం
కేంద్ర హోంమంత్రి అమిత్ షాను లక్ష్యంగా చేసుకుని కేజ్రీవాల్ పలు ప్రశ్నలు సంధించారు. “శ్రీరామాలయం ప్రాణ ప్రతిష్ఠ జరిగి రెండున్నరేళ్లు.. అంటే 891 రోజులు పూర్తయ్యాయి. ఈ కాలంలో అమిత్ షా ఒక్కసారి కూడా రామాలయాన్ని సందర్శించలేదు. శ్రీరాముడి పేరును అత్యధికంగా రాజకీయాల్లో ఉపయోగించిన వ్యక్తి ఆలయానికి మాత్రం వెళ్లలేదు” అని వ్యాఖ్యానించారు. తాను ఇంటర్నెట్లో వెతికానని… పాత్రికేయులతో మాట్లాడానని.. అలాగే చాట్‌జీపీటీని కూడా అడిగానని కేజ్రీవాల్ తెలిపారు. ‘‘అమిత్ షా తన ప్రసంగాల్లో.. ఇంటర్వ్యూల్లో 42 కంటే ఎక్కువసార్లు రామాలయం పేరును ప్రస్తావించి ఓట్లు అడిగారు. కానీ ఆలయానికి వెళ్లేందుకు మాత్రం సమయం దొరకలేదు” అని విమర్శించారు. ‘‘మీరు ఇప్పటివరకు రామాలయాన్ని ఎందుకు సందర్శించలేదు?, మీకు రామాలయానికి వెళ్లాలనే కోరిక లేదా?, మీకు శ్రీరాముడి ఆశీస్సులు అవసరం లేదా?, మీరు శ్రీరాముడిని దేవుడిగా భావించరా?.’’ అని ప్రశ్నలు సంధించారు. అంతేకాకుండా అమిత్ షా తప్పకుండా ఒకసారి రామాలయాన్ని సందర్శించాలని కేజ్రీవాల్ కోరారు.
14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
ఇదిలా ఉండగా రామాలయ విరాళాల దుర్వినియోగం కేసులో అరెస్టయిన నిందితులందరినీ అయోధ్య స్థానిక కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఆలయ విరాళాలు, కానుకల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసులో ఆర్థిక అవకతవకలు, నిధుల దుర్వినియోగానికి సంబంధించిన అంశాలను అధికారులు లోతుగా పరిశీలిస్తున్నారు.
తాజావార్తలు
-
Baljit Singh: ఇంట్లో కుళ్లిన స్థితిలో పంజాబీ గాయకుడి మృతదేహం.. రక్తపు మరకలు, చివరికి షాకింగ్ ట్విస్ట్!
-
Konda Surekha: ఇక నిరీక్షణ ముగిసింది.. అతి త్వరలోనే బిగ్ అప్డేట్.. వేచి చూడండి!
-
Kaaka : వచ్చే సంక్రాంతికి మెగాస్టార్ ‘కాకా’ లేనట్టేనా..?
-
Kareena Kapoor: ఆ టైంలో హీరోయిన్ అవ్వాలనే పిచ్చితో అలా చేశాను.. కానీ ఇప్పుడు అది బిగ్ రిగ్రెట్!
-
Irumudi: 200 కోట్లు దాటినా తగ్గని ‘ఇరుముడి’ జోరు.. సెప్టెంబర్ లో మరింత జోరు ఉంటుందా ?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!