Kareena Kapoor: ఆ టైంలో హీరోయిన్ అవ్వాలనే పిచ్చితో అలా చేశాను.. కానీ ఇప్పుడు అది బిగ్ రిగ్రెట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kareena Kapoor: బాలీవుడ్ ‘బేబో’ కరీనా కపూర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన అందం, అభినయం, విభిన్నమైన పాత్రలతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ స్టార్ హీరోయిన్.. ఎన్నో ఏళ్లుగా బాలీవుడ్లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతున్నారు. అయితే కరీనా జీవితంలో స్టార్డమ్ వెనుక ఓ అసంపూర్తి కోరిక ఉందట. అదే తన చదువు. ఇటీవల ఓ ఈవెంట్ పాల్గొన్న కరీనా తన చదువు గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తాను ఇంటర్ ఫస్ట్ ఇయర్ తర్వాత చదువును కొనసాగించలేదని, సినిమాల్లోకి రావాలనే కోరికతో చదువుకు స్వస్తి పలికానని ఆమె తెలిపారు. ఆ సమయంలో తన మనసు చెప్పిన మాట విని సినిమాల వైపు అడుగులు వేశానని, అయితే చదువును పూర్తి చేయలేకపోయాననే బాధ ఇప్పటికీ తనలో ఉందని కరీనా చెప్పుకొచ్చారు.
సినిమాల్లోకి రావడానికి తనకు అవకాశం వచ్చినప్పుడు.. చదువును కొనసాగించడం కంటే నటనపైనే దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్లు కరీనా వెల్లడించారు. తనను కొంతమంది విమర్శించినా, తనకు నచ్చిన రంగంలో తనను తాను నిరూపించుకోవాలనే పట్టుదలతో ముందుకు వెళ్లానని తెలిపారు. అలా చిన్న వయసులోనే బాలీవుడ్లో అడుగుపెట్టినట్లు వెల్లడించారు. అయితే తనకు ఎదురైన ఈ అనుభవం కారణంగానే ఇప్పుడు తన ఇద్దరు కుమారులు తైమూర్, జెహ్ చదువు విషయంలో తాను ఎంతో జాగ్రత్తగా ఉంటున్నట్లు తెలిపారు. ముందుగా చదువును పూర్తి చేయాలని, ఆ తర్వాత వారికి నచ్చిన రంగంలోకి వెళ్లాలని తన పిల్లలకు చెబుతున్నట్లు ఆమె తెలిపారు. తాను చదువును పూర్తి చేయలేకపోయాననే అసంతృప్తి తనలో ఉండటంతోనే పిల్లల విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నానని కరీనా స్పష్టం చేశారు.
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
కరీనాకు చదువుపై ఉన్న ప్రేమ కేవలం తన కుటుంబానికే పరిమితం కాలేదు. ఆమె 2014 నుంచి యూనిసెఫ్ ఇండియాతో అనుబంధంగా ఉంటూ పిల్లల విద్య, బాలికల విద్య, లింగ సమానత్వం వంటి అంశాలపై అవగాహన కల్పించే కార్యక్రమాల్లో ఆమె భాగస్వామిగా ఉన్నారు. తన వ్యక్తిగత అనుభవం కారణంగా బాలికలకు విద్య ఎంతో ముఖ్యమనే విషయాన్ని మరింత బలంగా నమ్ముతున్నట్లు కరీనా చెప్పారు. ఇక కరీనా సినీ ప్రయాణాన్ని చూస్తే.. ఆమె కేవలం 19 ఏళ్ల వయసులోనే బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. జేపీ దత్తా దర్శకత్వంలో తెరకెక్కిన ‘రెఫ్యూజీ’ సినిమాతో 2000లో హీరోయిన్గా పరిచయమయ్యారు. ఈ సినిమాలో అభిషేక్ బచ్చన్ సరసన నటించారు. విశేషమేమిటంటే.. అదే సినిమా ద్వారా అభిషేక్ బచ్చన్ కూడా హీరోగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. చిన్న వయసులోనే కెమెరా ముందుకు వచ్చిన కరీనా.. ఆ తర్వాత వరుస సక్సెస్‌లతో స్టార్ హీరోయిన్గా ఎదిగారు. ఎన్నో సూపర్‌హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు. అయితే కెరీర్లో ఎంతటి స్టార్డమ్ వచ్చినా.. చదువును మధ్యలోనే ఆపేయడం మాత్రం తన జీవితంలో ఇప్పటికీ ఓ అసంపూర్తి అధ్యాయంగానే మిగిలిపోయిందని కరీనా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు