NTV Telugu Site icon

Delhi: పంజాబ్‌ ప్రభుత్వంలో అలజడి.. కేజ్రీవాల్‌తో కేబినెట్, ఎమ్మెల్యేల భేటీ

Kejriwalmann

Kejriwalmann

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమి తర్వాత.. పంజాబ్ ప్రభుత్వంలో గుబులు మొదలైంది. భగవంత్ సింగ్ మాన్ ప్రభుత్వంలో విభేదాలు తలెత్తినట్లుగా వార్తలు వ్యాప్తి చెందుతున్నాయి. దాదాపు 35 మంది ఆప్ ఎమ్మెల్యేలు గట్టు దాటేందుకు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ సీనియర్ నేత ప్రతాప్‌సింగ్ బజ్వా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఆప్ హైకమాండ్ సీరియస్‌గా తీసుకుంది. పంజాబ్‌లో ప్రభుత్వం మార్పులు జరిగే సూచనలు కనిపించడంతో ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌తో సహా మంత్రులు, ప్రజాప్రతినిధులందరినీ కేజ్రీవాల్ ఢిల్లీకి పిలిపించారు. కపుర్తలా హౌస్‌లో పంజాబ్ నేతలందరితో సమావేశం అయ్యారు. తాజాగా రాజకీయ పరిణామాలపై వారితో చర్చిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Sperm Count: వీటిని తీసుకోవడం ఆపకపోతే స్పెర్మ్ కౌంట్ తగ్గడం గ్యారెంటీ.. జాగ్రత్త సుమీ

2027లో పంజాబ్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈనేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై వారితో కేజ్రీవాల్ చర్చిస్తు్నట్లు సమాచారం. అలాగే వ్యక్తిగత విభేదాలు పక్కన పెట్టి పార్టీ కోసం పని చేయాలని సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కేజ్రీవాల్ తీరును పంజాబ్ కాంగ్రెస్ నాయకుడు సుఖ్‌జిందర్ సింగ్ రాంధావ్ తప్పుపట్టారు. ఒక్కడు (కేజ్రీవాల్) పంజాబ్ వస్తే సరిపోతుంది కదా?.. అలాంటిది పంజాబ్ ప్రతినిధుల్ని తన దగ్గరకు రప్పించుకోవడం ఏ మాత్రం భావ్యంగా ఉందా? అని నిలదీశారు.

ఇది కూడా చదవండి: Delhi: పంజాబ్‌ ప్రభుత్వంలో అలజడి.. కేజ్రీవాల్‌తో కేబినెట్, ఎమ్మెల్యేల భేటీ

ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా బీజేపీ 48, ఆప్ 22 స్థానాలు కైవసం చేసుకున్నాయి. కేజ్రీవాల్, మనీష్ సిసోడియా లాంటి ఉద్దండులంతా ఓటమి చెందారు. ఇక 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇక బీజేపీ.. ఇంకా ముఖ్యమంత్రి ఎంపిక చేయలేదు. అయితే మహిళను ముఖ్యమంత్రిగా చేయొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా దళిత ముఖ్యమంత్రి ఉండొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రధాని మోడీ అమెరికా పర్యటన నుంచి తిరిగి వచ్చాకే.. ఢిల్లీ ముఖ్యమంత్రి ఎంపిక ఉండనుంది.

ఇది కూడా చదవండి: RC 16: క్రికెట్ విత్ కుస్తీ.. టైటిల్ వేటలో యూనిట్