Karnataka: ఫ్రీ బస్సు కోసం కోటి ‘శక్తి’ స్మార్ట్ కార్డులు పంపిణీ.. రూ.250 కోట్లు ఖర్చు!
- మహిళల కోసం కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం
- ఫ్రీ బస్సు కోసం కోటి ‘శక్తి’ స్మార్ట్ కార్డులు పంపిణీ
- స్మార్ట్ కార్డుల కోసం రూ.250 కోట్లు ఖర్చు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళల కోసం కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శక్తి పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది మహిళలకు ఉచితంగా స్మార్ట్ కార్డులు పంపిణీ చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్న ఈ పథకంలో భాగంగా తొలి దశలో సుమారు కోటి స్మార్ట్ కార్డులను అందించనున్నారు. ఇందుకోసం దాదాపు రూ.250 కోట్లు ఖర్చు చేయనున్నట్లు రవాణా మంత్రి బైరతి సురేశ్ తెలిపారు. ఈ మొత్తం వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.150 కోట్లు భరించనుండగా.. మిగిలిన మొత్తాన్ని రాష్ట్రంలోని నాలుగు రవాణా సంస్థలు సమకూర్చనున్నాయి. స్మార్ట్ కార్డుల పంపిణీ ప్రక్రియ త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
స్మార్ట్ కార్డులతో ఏం ప్రయోజనం?
ప్రస్తుతం శక్తి పథకం కింద కర్ణాటకలో నివాసం ఉంటున్న మహిళలు చెల్లుబాటు అయ్యే స్థానిక గుర్తింపు పత్రాన్ని చూపించి అర్హత కలిగిన ప్రభుత్వ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ఈ పథకం 2023 జూన్ 11న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐదు గ్యారంటీల్లో భాగంగా ప్రారంభమైంది. అయితే శక్తి పథకంలో ప్రయాణికుల ధ్రువీకరణను మరింత పటిష్ఠం చేయడంతో పాటు.. పథకం దుర్వినియోగాన్ని అరికట్టేందుకు స్మార్ట్ కార్డులను తీసుకువస్తున్నారు.
Also Read
- Mamata Banerjee: మమతా బెనర్జీపై కత్తితో దాడికి మహిళ యత్నం.?
- Essential Commodity Prices: వంటింట్లో మంటలు.. 42 వస్తువుల్లో 41 ధరలు పెరుగుదల..! నిత్యావసరాల తాజా లెక్కలివే
- L Murugan Resigns: కేంద్ర మంత్రి పదవికి మురుగన్ రాజీనామా.. కారణం ఏంటంటే..
- Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా 2-3 కోట్ల స్మార్ట్ కార్డులు జారీ చేసే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. వీటి కోసం కర్ణాటక ఓటర్ ఐడీ కార్డును కీలక పత్రంగా పరిగణించే అవకాశం ఉంది. ఈ కార్డుల్లో NFC టెక్నాలజీని ఉపయోగించనున్నారు. భవిష్యత్తులో వీటిని నమ్మ మెట్రోతో అనుసంధానించి.. వివిధ ప్రజా రవాణా వ్యవస్థల్లో ఒకే కార్డును ఉపయోగించేలా చేసే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు.
బెంగళూరుకు 4,500 ఎలక్ట్రిక్ బస్సులు
బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (BMTC)లోకి 4,500 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కేంద్రం చేపట్టిన PM E-DRIVE కార్యక్రమం కింద ఈ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా సుమారు రూ.600 కోట్లు ఖర్చు చేయనుందని మంత్రి బైరతి సురేశ్ తెలిపారు. 20 ఏళ్లలో మొత్తం వ్యయం దాదాపు రూ.12,000 కోట్లు ఉండొచ్చని చెప్పారు. వివిధ తయారీ సంస్థలు దశలవారీగా ఎలక్ట్రిక్ బస్సులను తయారు చేసి సరఫరా చేస్తాయని.. అనంతరం బెంగళూరులోని BMTC ఫ్లీట్‌లో వాటిని ప్రవేశపెడతామని మంత్రి తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సులతో వాహన కాలుష్యం, ఉద్గారాలను తగ్గించవచ్చని పేర్కొన్నారు. PM E-DRIVE కింద వివిధ తయారీ సంస్థల ద్వారా ఎలక్ట్రిక్ బస్సుల సరఫరాకు కేంద్రం సహకరిస్తుందని మంత్రి తెలిపారు. కిలోమీటర్ ప్రాతిపదికన BMTC ఆయా కంపెనీలకు చెల్లింపులు చేయనుంది.
రాష్ట్ర ప్రజా రవాణా మౌలిక వసతులను అభివృద్ధి చేసేందుకు కేంద్రం నుంచి రూ.2,000 కోట్ల రుణం తీసుకోవాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిధులతో కొత్త బస్ డిపోలను నిర్మించడంతో పాటు.. ప్రస్తుతం ఉన్న బస్ స్టాండ్లను ఆధునికీకరించనున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ బస్సుల నెట్‌వర్క్‌ను మరింత విస్తరించి.. ఆధునికీకరించేందుకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.
బస్సు ఛార్జీలు పెరిగే అవకాశం?
కర్ణాటకలోని నాలుగు ప్రభుత్వ రవాణా సంస్థలు పెరుగుతున్న నిర్వహణ, ఇంధన వ్యయాలతో ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. అదే సమయంలో చాలాకాలంగా బస్సు ఛార్జీలను పెంచలేదు. బస్సు ఛార్జీలను సవరించే అంశాన్ని పరిశీలించేందుకు రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి అతుల్ తివారీ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ త్వరలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించే అవకాశం ఉంది. ఛార్జీలను పెంచాల్సి వస్తే.. అది పరిమిత స్థాయిలోనే ఉంటుందని, ప్రయాణికులపై గణనీయమైన భారం పడకుండా చూస్తామని మంత్రి బైరతి సురేశ్ తెలిపారు. రవాణా సంస్థల ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం సహకరిస్తుందని ముఖ్యమంత్రి డీకే శివకుమార్ హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
Explainer: TVS ఫ్యామిలీ గొడవేంటి?
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!