Prajwal Revanna S*x Scandal: ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ వీడియోలను స్టోర్ చేసుకోవద్దు.. ప్రజలకు సిట్ హెచ్చరిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prajwal Revanna S*x Scandal: ప్రజ్వల్ రేవణ్ణ, ఆయన తండ్రి హెచ్డీ రేవణ్ణ సెక్సు టేపులు కర్ణాటకలో సంచలనంగా మారాయి. కర్ణాటక వ్యాప్తంగా ముఖ్యంగా హసన్ జిల్లాలో ఇవి వైరల్‌గా మారాయి. ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించి అనేక మంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన వీడియోలు బయటకు వచ్చాయి. ఇదిలా ఉంటే ఈ ఉదంతంపై కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కోసం ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేసింది. మరోవైపు ఈ వ్యవహారంపై రేవణ్ణ ఇంట్లో పనిచేసిన 47 ఏళ్ల మహిళ ప్రజ్వల్‌తో పాటు ఆయన తండ్రి హెచ్డీ రేవణ్ణలపై లైంగిక వేధింపుల ఫిర్యాదు చేసింది. మరోవైపు ఓ మహిళను కిడ్నాప్ చేసిన కేసులో సిట్ హెచ్డీ రేవణ్ణను అరెస్ట్ చేసింది. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజ్వల్ దేశం వదిలి జర్మనీ పారిపోయాడు.
Read Also: Priyanka Gandhi: దేశద్రోహులుగా పిలుస్తారని గాంధీ, నెహ్రులు ఊహించలేదు..
Also Read
బాధిత మహిళల కోసం సిట్ హెల్ప్‌లైన్‌ని ప్రారంభించింది. ఈ వీడియోలు కలిగి ఉన్నవారికి సిట్ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజ్వల్, అతని తండ్రి రేవణ్ణలకు సంబంధించిన సెక్స్ టేపులను ప్రజలు ఎవరూ స్టోర్ చేసుకోవద్దని వార్నింగ్ ఇచ్చింది. ఎవరైనా కలిగి ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పింది. సోషల్ మీడియాలో వీడియోలను షేర్ చేసుకోవద్దని కోరింది. ‘‘వీడియోలు, చిత్రాలు మరియు ఆడియో క్లిప్‌లను నిల్వ చేయడం చట్టం ప్రకారం క్రిమినల్ చర్యలకు దారి తీస్తుంది. కాబట్టి అలాంటి వీడియోలు, చిత్రాలు మరియు ఆడియో క్లిప్‌లను స్టోర్ చేయడం లేదా ప్రసారం చేయకుండా ఉండటానికి ప్రజలు దీని గురించి తెలుసుకోవాలి’’ అని సిట్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇలాంటి వీడియోలు షేర్ చేయడం వల్ల బాధితుల పరువు, గౌరవం దెబ్బతింటాయని సిట్ పేర్కొంది. ఈ వీడియోలను షేర్ చేస్తున్న వ్యక్తులను గుర్తించడం సులువు కాబట్టి, ప్రజలు వారి పరికరాల నుంచి ఈ వీడియోలు, ఆడియోలను తొలగించాలని సూచించింది.
తాజావార్తలు
-
Kasarla Shyam: “గద్దల నెత్తులు నరికిన కాకుల రాజ్యం”.. ‘ది ప్యారడైజ్’పై కాసర్ల శ్యామ్ గూస్బంప్స్ స్పీచ్!
-
The Paradise : ఏపీలో ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల హైక్
-
AP High Court: గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆధారాలు, డాక్యుమెంట్లు ఇవ్వాలని ఆదేశం
-
US-Iran: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా భారీ షాక్.. ఎల్లుండి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న సర్వీసులు!
-
CM Revanth Reddy: హైదరాబాద్‌కి నెట్‌ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్ ఎంట్రీ.. సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!