Karnataka: ‘‘చిల్లర లేకుపోతే దిగిపో..’’ మంత్రికే షాక్ ఇచ్చిన బస్ కండక్టర్..
- ప్రయాణికుడి వేషంలో బీఎంటీసీ బస్సుల్లో మంత్రి తనిఖీలు.
- రూ.100కు చిల్లర లేదని మంత్రినే బస్సు దిగమన్న కండక్టర్.
- ప్రయాణికుడిని స్టాప్ వద్ద దింపకపోవడంతో డ్రైవర్, కండక్టర్ సస్పెన్షన్.
- బెంగళూరులో ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని మంత్రి స్పష్టం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: కర్ణాటక రవాణా మంత్రి బైరతి సురేష్, ప్రయాణికుడి వేషంలో శనివారం రాత్రి బెంగళూర్‌లో బీఎంటీసీ బస్సుల్లో ప్రయాణించారు. ప్రయాణికుల సౌకర్యాలను అంచనా వేయడానికి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఒక సాధారణ ప్రయాణికుడిగా నటిస్తూ ప్రజలకు అందుతున్న సౌకర్యాలు, బస్సు డ్రైవర్-కండక్టర్ పనితీరును అంచనా వేశారు. సుమారు 2 గంటల పాటు 10కి పైగా బస్సుల్లో ఆయన ప్రయాణించారు.
ఈ ఆకస్మిక తనిఖీల్లో మంత్రికి పలు షాక్‌లు తగిలాయి. కొందరు డ్రైవర్లు, కండక్టర్లు ప్రయాణికులతో నిర్లక్ష్యంగా వ్యవహరించడం చూశారు. నిర్లక్ష్యం మరియు నిబంధనల ఉల్లంఘనలను కారణంగా చూపుతూ, బీఎంటీసీ బస్సు డ్రైవర్, కండక్టర్‌ను తక్షణమే సస్పెండ్ చేస్తూ మంత్రి కఠినమైన ఉత్తర్వులు జారీ చేశారు. తనిఖీ సమయంలో ఒక ప్రయాణికుడు బస్సు దిగుతున్నానని చెబుతున్నప్పటికీ బస్ స్టాప్‌లో ఆపకపోవడంపై ఇద్దరు ఉద్యోగుల్ని సస్పెండ్ చేశారు.
Also Read
- Monsoon: రైతులకు గుడ్ న్యూస్.. జోరందుకోనున్న రుతుపవనాలు.. జూలై 18-25 మధ్య భారీ వర్ష సూచన
- Tamil Nadu: కాంగ్రెస్ ద్రోహం చేసింది, విజయ్‌తో చేతులు కలిపేది లేదు: డీఎంకే.
- Earthquake: బంగాళాఖాతంలో 4.5 తీవ్రతతో భూకంపం.. ఆంధ్రలో ప్రకంపనలు..
- Bengaluru Crime: బెంగళూరులో దారుణం.. పార్సిల్ ఇవ్వడానికి వచ్చి పశువులా ప్రవర్తించిన కామాంధుడు! ఏం చేశాడో తెలుసా?
ఇదిలా ఉంటే, మరో బస్సులో మంత్రికే ఓ కండక్టర్ షాక్ ఇచ్చారు. హెబ్బాల్ నుంచి నాగశెట్టిహళ్లీ మార్గంలో ప్రయాణిస్తుండగా, టికెట్ కోసం మంత్రి రూ. 100 నోటు ఇస్తే చిల్లర లేదని చెబుతూ కండక్టర్ మంత్రిని బస్సు దిగిపో అని హెచ్చరించడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఉద్యోగులు క్రమశిక్షణ, జవాబుదారీతనంతో వ్యవహరించేందుకు మంత్రి సురేష్ ఈ చర్యలు తీసుకున్నారు.
Conducted a surprise field inspection by travelling on BMTC buses across Bengaluru to assess commuter experience firsthand. Ensuring safe, reliable and accountable public transport remains our highest priority.@BMTC_BENGALURU#BMTC #Bengaluru #PublicTransport #Karnataka pic.twitter.com/uyFOqsuwmd
— Byrathi Suresh (@byrathi_suresh) July 12, 2026
తాజావార్తలు
-
Karnataka: ‘‘చిల్లర లేకుపోతే దిగిపో..’’ మంత్రికే షాక్ ఇచ్చిన బస్ కండక్టర్..
-
Tollywood Directors: కథలు రెడీ.. హీరోలే మిస్సింగ్! టాలీవుడ్ హిట్ డైరెక్టర్లకు కొత్త టెన్షన్..
-
Maa Inti Bangaram: 100 కోట్ల క్లబ్లో ‘మా ఇంటి బంగారం’.. తెలుగు సినీ చరిత్రలో సమంత రేర్ ఫీట్..
-
Monsoon: రైతులకు గుడ్ న్యూస్.. జోరందుకోనున్న రుతుపవనాలు.. జూలై 18-25 మధ్య భారీ వర్ష సూచన
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
ట్రెండింగ్
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..