సరస్వతి నది పుష్కరాలకు తెలంగాణ ప్రభుత్వం రూ. 25 కోట్లు మంజూరు చేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం క్షేత్రంలో ఈ ఏడాది మే 15 నుంచి 26 వరకు పుష్కరాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
నంద్యాల జిల్లా డోన్‌లో ఘరానా మోసం వెలుగు చూసింది. క్రిప్టో కరెన్సీ పేరుతో రామాంజనేయులు అనే మోసగాడు సుమారు రూ. 25 కోట్లు వసూలు చేశాడు. బైనాన్స్, ఒకే-ఎక్స్ యాప్స్‌లో ట్రేడింగ్ చేస్తూ, లక్ష పెట్టుబడికి నెలకు పదివేలు ఇస్తామంటూ నమ్మబలికాడు కేటుగాడు.. అలా దాదాపు రూ. 25 కోట్లు వసూలు చేశారు. కర్నూలు, నంద్యాల, మహబూబ్ నగర్ జిల్లాల్లో 300 మందికి పైగా భాదితులు ఉన్నట్టు సమాచారం.
చాలా మంది అప్పుడప్పుడు కష్టాలొచ్చినప్పుడు ఏదైనా లాటరీ తగిలితే బాగుండును బాధలన్నీ తీరిపోతాయని అనుకుంటారు. ఇబ్బందులు వచ్చినప్పుడు ఇలా అనుకోవడం సహజమే. కానీ అదే నిజమైంది ఓ కుటుంబానికి. లక్ష కాదు.. రెండు లక్షల కాదు.. ఏకంగా రూ.25 కోట్ల లాటరీ తగిలింది. దీంతో ఆ కుటుంబం సంతోషంతో మునిగిపోయింది.