ఒమిక్రాన్ ఎఫెక్ట్.. టీకా వేసుకుంటేనే సినిమా హాల్లోకి ఎంట్రీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒమిక్రాన్ వైరస్ వేగంగా విస్తరిస్తుండడంతో నివారణ చర్యలు చేపడుతున్నా దేశాలు.. ఇక, భారత్‌లోని రాష్ట్రాలు కూడా ఈ మహమ్మారి విజృంభించకుండా కీలక నిర్ణయాలు తీసుకుంఉటన్నాయి.. ఇక, ఒమిక్రాన్ కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది కర్ణాటక ప్రభుత్వం.. ముందుగా సమీక్ష సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై.. ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్, మంత్రి గోవింద కారజోళ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రవికుమార్, సీనియర్ అధికారి మంజునాథ్ ప్రసాద్, బీబీఎంపీ అధికారులు, నిపుణులతో సమాలోచనలు చేశారు.. ఆ తర్వాత ప్రభుత్వం మార్గవర్శకాలు విడుదల చేసింది.
ఇక, ఆరోగ్యసౌధ నుంచి 21 మెడికల్ కళాశాల డైరెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ద్వారా మాట్లాడారు సీఎం బొమ్మై… రాష్ట్రంలో రెండు కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో.. కేసులు పెరిగితే పీజీ విద్యార్థులను వైద్య సేవలకు వినియోగించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.. ఆస్పత్రుల్లో సిబ్బంది సంఖ్య పెంచేవిధంగా నిర్ణయం తీసుకున్నారు.. పారామెడికల్ కోర్సు చదివే 18 వేల మంది సేవలను కూడా ఉపయోగించుకుంటామన్నారు. ఐసీయూ ఏర్పాట్లు, పరికరాల కొనుగోళ్లపై కూడా సుదీర్ఘ చర్చ సాగింది.. ఇక, మార్గదర్శకాల్లో కీలక అంశాలు ప్రస్తావించారు.. జనాలు ఎక్కువగా గుమ్మిగూడే అవకాశం ఉన్న చోట్ల కఠిన నిర్ణయాలు అమలు చేయనున్నారు. సినిమా హాల్, మాల్స్‌కు వెళ్లేందుకు రెండు డోస్‌ల వ్యాక్సిన్ తప్పనిసరి చేసింది సర్కార్.. తల్లిదండ్రులు రెండు డోస్‌ల టీకాలు తీసుకుంటునే వారి పిల్లలను పాఠశాలల్లోకి అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.. పాఠశాల, కాలేజీల్లో సభలు, సమావేశాలకు ఇక అనుమతి ఉండదని పేర్కొన్న ప్రభుత్వం.. వివాహాది కార్యాలకు 500 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని మార్గదర్శకాల్లో పేర్కొంది.
Also Read
- Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
- MEA: కరాచీ దాడిని భారత్‌పై నెట్టొద్దు.. పాక్‌పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బెంచ్‌కే పరిమితమైన ‘బేబీ బాస్’.. వైభవ్‌కు ఎందుకు ఛాన్స్ లేదు?
-
Cinema News: థియేటర్లలో ఫ్లాప్.. యూట్యూబ్‌లో చరిత్ర సృష్టించిన బెల్లంకొండ సినిమా!
-
Suriya : రాజకీయాల్లోకి తమిళ స్టార్ హీరో సూర్య ఎంట్రీ.?
-
Jai Moondra: రెండు మ్యాచ్‌లకే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అండ్ ‘సిరీస్’.. టీమిండియాపై ఈ అవార్డులు వస్తాయనుకోలేదు!
-
Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!