Karnataka: తనపై నమోదైన పోక్సో కేసును కొట్టివేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను కర్ణాటక హైకోర్టు ఈరోజు (జనవరి 15) వాయిదా వేసింది. జస్టిస్ ఎం నాగప్రసన్న ముందు సీఐడీ తరపున సీనియర్ న్యాయవాది రవివర్మ కుమార్ వాదనలు వినిపించడంతో పాటు సంఘటనకు సంబంధించిన వీడియో, ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ నివేదికతో సహా కీలకమైన సాక్ష్యాలను సమర్పించారు. ఇక, ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ నివేదిక ప్రకారం.. యడ్యూరప్ప వాయిస్ శాంపిల్ సాక్ష్యంలోని ఆడియోతో పాటు వీడియో సాక్ష్యాలను గుజరాత్‌లోని నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ డిపార్ట్‌మెంట్ ధృవీకరించింది.. అది తారుమారు చేయబడలేదని సీఐడీ తరపు లాయర్ తెలిపారు.
Read Also: China Manja: వాహనదారులకు శాపంగా మారుతున్న చైనా మాంజా..
ఇక, మరోవైపు, సెక్షన్ 161 కింద నమోదు చేయబడిన సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా కేసును కొట్టివేయలాని సీనియర్ న్యాయవాది వాదించారు. ఇది పోలీసులు నేరం గురించి సమాచారాన్ని అందించగల వ్యక్తులను పరిశీలించడానికి అనుమతిస్తుంది అన్నారు. తన వాదనలకు మద్దతుగా సుప్రీంకోర్టు తీర్పులను ఉదహరణగా తీసుకున్నారు. ఇక, కేసు ఆలస్యం కావడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ తన వాదనలను ముగించారు యడ్యూరప్ప తరపు న్యాయవాది. ఇక, ఇరువురు వాదనలు విన్న కర్ణాటక హైకోర్టు తదుపరి విచారణను జనవరి 17వ తేదీకి వాయిదా వేసింది. యడ్యూరప్పకు బెయిల్ మంజూరు చేస్తూ ట్రయల్ కోర్టుకు హాజరు నుంచి మినహాయింపు ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది.
Read Also: Side Effects of Smoking: సిగరెట్లు ఎక్కువగా తాగుతున్నారా? దాని సైజ్ తగ్గుతుందట!
అయితే, 2024 ఫిబ్రవరిలో బెంగళూరు నివాసంలో యడ్యూరప్ప తన 17 ఏళ్ల కుమార్తెను వేధించాడని ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రిపై నమోదు అయింది. సదరు మహిళ గత ఏడాది మేలో ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో చనిపోయింది. యడ్యూప్పపై లైంగిక వేధింపుల ఫిర్యాదు మార్చి 2024లో నమోదైంది. కాగా, పోలీసుల నిర్లక్ష్యంపై బాధితురాలి సోదరుడు జూన్‌లో యడ్యూరప్పను తక్షణమే అరెస్టు చేసి విచారించాలని డిమాండ్ చేస్తూ హైకోర్టులో తాజాగా పిటిషన్‌ను దాఖలు చేశారు.