NTV Telugu Site icon

Delhi: ప్రధాని మోడీతో కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ భేటీ

Pmmodi

Pmmodi

ఢిల్లీలో ప్రధాని మోడీని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ప్రధానితో చర్చించారు. అనంతరం శివకుమార్ మీడియాతో మాట్లాడారు. కర్ణాటకకు కేంద్ర బడ్జెట్‌లో నిధులు ప్రకటించకపోవడంతో బుధవారం ప్రధాని నరేంద్ర మోడీని కలిసినట్లు తెలిపారు. బెంగళూరు నగరంలో చేపట్టబోయే కొత్త ప్రాజెక్టులకు గ్రాంట్లు అందించాలని ప్రధానిని కోరినట్లు పేర్కొన్నారు. నీటిపారుదల, నీటి రంగాలకు నిధులు కేటాయించలేదన్నారు. అయితే బెంగళూరు ప్రాజెక్టులకు మద్దతు ఇస్తామని ప్రధాని హామీ ఇచ్చారని చెప్పారు.

ఇది కూడా చదవండి: Pakistan: F-16 యుద్ధ విమానాలను నడపలేని స్థితిలో పాక్.. ఆర్థిక ఇబ్బందులతో వ్యూహాత్మక చిక్కులు..

దేశంలో అత్యధిక పన్ను చెల్లింపుదారులలో కర్ణాటక రెండవ స్థానంలో ఉందని.. పన్నుల చెల్లింపులకు బెంగళూరు అత్యధికంగా సహకరిస్తుందని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర తరహాలో కర్ణాటక ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని మోడీని కోరినట్లు చెప్పారు. సిగ్నల్ రహిత కారిడార్లు, ఫ్లైఓవర్లు కావాలని అడిగినట్లు పేర్కొన్నారు. వాటిని పరిగణలోకి తీసుకుంటానని ప్రధాని హామీ ఇచ్చారని శివకుమార్ తెలిపారు. కర్నాటకకు గతేడాది కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన రూ.5,300 కోట్ల మంజూరు అంశాన్ని కేంద్ర కేబినెట్ సమావేశంలో చర్చిస్తామని ప్రధాని హామీ ఇచ్చారని శివకుమార్ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: CM Chandrababu: 5 నూతన పాలసీలు, 4 చోట్ల కొత్త క్లస్టర్లు.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు