Site icon NTV Telugu

Karnataka: డీకే ఇంటికి బ్రేక్‌ఫాస్ట్‌కు వచ్చిన సిద్ధరామయ్య.. ఏం జరుగుతోంది?

Dksivakumar

Dksivakumar

కర్ణాటకలో ప్రస్తుతం బ్రేక్‌ఫాస్ట్ రాజకీయాలు నడుస్తున్నాయి. ‘‘నీ ఇంటికి నేనొస్తా.. నా ఇంటికి నువ్వు.. రా!’’ అన్నట్టుగా సిద్ధరామయ్య-డీకే.శివకుమార్ మధ్య పాలిటిక్స్ సాగుతున్నాయి. బ్రేక్‌ఫాస్టేనా? ఇంకేమైనా? ఉందా? అన్నది మాత్రం తేలడం లేదు.

గత కొద్దిరోజులు ‘పవర్ షేరింగ్‌’ రెండు వర్గాల మధ్య వివాదం నడుస్తోంది. మొన్నటి దాకా హస్తిన వేదికగా హైకమాండ్ దగ్గర పంచాయితీ నడిచింది. ఆ తర్వాత ఏమైందో తెలియదు గానీ బెంగళూరుకు షిప్ట్ అయింది. ప్రస్తుతం అల్పాహార విందులు జరుగుతున్నాయి. గత శనివారం సిద్ధరామయ్య ఇంటికి డీకే.శివకుమార్ బ్రేక్‌ఫాస్ట్‌ కెళ్తే.. ఈరోజు డిప్యూటీ సీఎం ఇంటికి సిద్ధరామయ్య అల్పాహార విందుకు వచ్చారు. ప్రస్తుతం కర్ణాటకలో విచిత్రమైన పాలిటిక్స్ నడుస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే పవర్ షేరింగ్ వ్యవహారం మాత్రం తేలడం లేదు. ప్రస్తుతం సిద్ధరామయ్య రెండున్నరేళ్ల పాలనను పూర్తి చేసుకున్నారు. మిగతా రెండేన్నరేళ్లు డీకే.శివకుమార్‌ను ముఖ్యమంత్రిని చేయాలంటూ ఆయన వర్గం గట్టిగా డిమాండ్ చేస్తోంది. అయితే హైకమాండ్ ఏదొకటి తేలుస్తుందా? లేదంటే ఇలానే బ్రేక్‌ఫాస్ట్‌లతో సాగదీస్తుందో వేచి చూడాలి.

Exit mobile version