NTV Telugu Site icon

Kangana Ranaut: వ్యవసాయ చట్టాలపై కంగనా కామెంట్స్.. పంజాబ్‌లో బీజేపీ ప్రతిష్టకు నష్టం..!

Kangana

Kangana

Kangana Ranaut: మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. దీంతో ఈ చట్టాలను మోడీ ప్రభుత్వం ఉపసంహరించుకున్న తర్వాత ఈ చట్టాలపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మూడు చట్టాలను తిరిగి తీసుకురావాలని సూచించడంతో తీవ్ర దుమారం రేపుతుంది. అయితే ఆమె వ్యాఖ్యలకు బీజేపీ దూరంగా ఉండటంతో నిన్న క్షమాపణలు చెప్పారు. ఆ వ్యాఖ్యలు తన వ్యక్తిగత అభిప్రాయాలు.. పార్టీది కాదని తెలిపారు. అయితే, కమలం పార్టీ ఎంపీ కంగనా క్షమాపణలు చెప్పినప్పటికీ పంజాబ్‌లో బీజేపీ ప్రతిష్టకు కలిగించిన నష్టాన్ని తగ్గించలేకపోయాయి.

Read Also: Budget 5G Smartphones 2024: తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్‌ కొనాలనుకుంటున్నారా?.. 15 వేల్లోపు బెస్ట్‌ ఫోన్లు ఇవే!

ఇక, పంజాబ్‌తో ప్రధాని నరేంద్ర మోడీకి ఉన్న బంధాన్ని ఇలాంటి నిరాధారమైన, అశాస్త్రీయమైన వ్యాఖ్యల ద్వారా అంచనా వేయవద్దని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ తెలిపారు. కంగనా రనౌత్ వ్యాఖ్యలు వ్యక్తిగతం పార్టీకి సంబంధించినది కాదని తెలిపారు. కానీ ఒక పంజాబీలపై సిక్కు సమాజంపై నిరాధారమైన ఆరోపణలు చేయడం మంచిది కాదన్నారు. ఈలాంటి కామెంట్స్ వల్ల పంజాబ్ రైతులందరి మనోభావాలను దెబ్బ తీస్తున్నాయని అన్నారు. పంజాబీల సంక్షేమం కోసం ప్రధాని మోడీ చేసిన మంచి మొత్తం పోయిందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ పేర్కొన్నారు. అయితే, ఈ సంవత్సరం ప్రారంభంలో హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు ఎన్నికైన కంగనా రనౌత్.. కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాలను తిరిగి తీసుకు రావాలని తెలిపింది.