Kangana Ranaut: బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై చండీగఢ్ ఎయిర్‌పోర్టులో సీఐఎస్ఎఫ్ మహిళా అధికారి దాడి చేయడం సంచలనంగా మారింది. కుల్విందర్ కౌర్‌గా చెప్పబడుతున్న అధికార కంగనా చెంపపై కొట్టారు. హిమాచల్ ప్రదేశ్ మండి నుంచి ఢిల్లీ వెళ్తున్న సందర్భంలో కంగనాకు ఈ చేదు అనుభవం ఎదురైంది. సెక్యూరిటీ చెక్ ముగించుకుని తాను బోర్డింగ్ పాయింట్‌కి వెళ్తున్న సమయంలో మహిళా అధికారి తన మొహంపై కొట్టిందని, ఎందుకు ఇలా చేశావని ప్రశ్నిస్తే తనను దూషించిందని కంగనా రనౌత్ ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు. తాను క్షేమంగా ఉన్నానని కానీ పంజాబ్‌లో పెరుగుతున్న ఉగ్రవాదం, తీవ్రవాదం గురించి ఆందోళనతో ఉన్నానని ఆమె అన్నారు.
Read Also: Kangana : కంగనా చెంప పగలకొట్టిన కానిస్టేబుల్.. సెల్ఫీ వీడియో రిలీజ్!
అయితే, ఈ సంఘటనలో సదరు అధికారిని సస్పెండ్ చేశారు. ఆమెను ఉన్నతాధికారులు విచారిస్తున్నారు. రైతులు ఆందోళన సందర్భంగా పంజాబ్ మహిళ గురించి కంగనా చేసిన వ్యాఖ్యల వల్లే తాను ఆమెను కొట్టానని చెప్పినట్లు సమచారం. దీంతో పాటు ఆమె తన చర్యను సమర్థించుకునేందుకు చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. రైతు ఉద్యమంలో పాల్గొన్న వారు రూ. 100 తీసుకుని వచ్చారని కంగనా చేసిన వ్యాఖ్యలపై, ‘‘ 2020-2021 నిరసనల సమయంలో ఢిల్లీ సరిహద్దుల్లో క్యాంప్ చేస్తున్న రైతుల్లో తన తల్లి ఒకరని చెప్పింది. “రైతులు రూ. 100 కోసం అక్కడ కూర్చున్నట్లు ఆమె స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఆమె వెళ్లి అక్కడ కూర్చుంటారా? ఈ స్టేట్‌మెంట్ ఇచ్చేటప్పుడు మా అమ్మ అక్కడే కూర్చుని నిరసన వ్యక్తం చేసింది’’ అని కుల్విందర్ కౌర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఆమెకు మద్దతుగా రైతులు చండీగఢ్ ఎయిర్ పోర్టు వైపు వస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
CISF woman who slapped Kangana Ranaut #KanganaRanaut pic.twitter.com/fLL9O7CpT9
— Siddharth (@SidKeVichaar) June 6, 2024