Kangana Ranaut: కంగనా రనౌత్ గొడ్డుమాంసం తింటుందన్న కాంగ్రెస్ నేత.. ఆమె స్పందన ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kangana Ranaut: బీజేపీ లోక్‌సభ అభ్యర్థి, హిమాచల్ ప్రదేశ్ మండి నుంచి పోటీ చేస్తున్న కంగనా రనౌత్‌పై కాంగ్రెస్ నేత వివాదాస్పద ఆరోపణలు చేశారు. ఆమె గొడ్డుమాంసం(బీఫ్) తింటుందని ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణల్ని ఆమె తోసిపుచ్చారు. తాను హిందువుగా గర్విస్తున్నానని అన్నారు. తనపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవిగా కొట్టిపారేశారు. ‘‘ నేను గొడ్డు మాంసం లేదా మరే ఇతర రకాల రెడ్ మీట్ తినను, నాపై నిరాధారమైన పుకార్లు వ్యాప్తి చేయడం సిగ్గుచేటు’’ అని ఆమె ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
Read Also: Pushpa 2 Teaser: 68 సెకండ్ల టీజర్.. చీరలో అల్లు అర్జున్!
Also Read
తాను దశాబ్దాలుగా యోగ, ఆయుర్వేద జీవన విధానాన్ని సమర్థిస్తున్నానని, వాటిని ప్రచారం చేస్తున్నానని చెప్పారు. ఇలాంటి ఆరోపణలు నా ప్రతిష్టను దెబ్బతీయడానికి పనిచేయవని అన్నారు. నా గురించి ప్రజలకు తెలుసని, నేను హిందువునని, జైశ్రీరాం అంటూ నినదించారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ పక్ష నేత విజయ్ వాడేట్టివార్ మాట్లాడుతూ.. కంగనా రనౌత్ తాను బీఫ్ తనడాన్ని ఇష్టపడ్డానని ట్వీట్ చేశారని, బీజేపీ పార్టీ ఇప్పుడు ఆమెకు టికెట్ ఇచ్చిందని ఆరోపించిన నేపథ్యంలో కంగనా రనౌత్ స్పందించారు.
ఏప్రిల్ 5న మహారాష్ట్రలో జరిగిన ర్యాలీలో వాడెట్టివార్ మాట్లాడుతూ.. అవినీతి నాయకులందరికీ బీజేపీ స్వాగతం చెబుతోందని విమర్శించారు. బీజేపీ అధికార ప్రతినిధి కేశవ్ ఉపాధ్యాయే మాట్లాడుతూ.. వాడేట్టివార్ వ్యాఖ్యలు కాంగ్రెస్ మురికి సంస్కృతిని ప్రతిబింబిస్తున్నాయని అన్నారు. సమస్యలపై కాంగ్రెస్ తమతో పోరాడటం లేదని, ఇది పార్టీ ఓటమి మనస్తత్వాన్ని చూపుతోందని అన్నారు. కంగనా రనౌత్‌పై కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనాటే ఇన్‌స్టాగ్రామ్ పోస్టు వివాదాస్పదమైన తర్వాత తాజాగా మరో కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
I don’t consume beef or any other kind of red meat, it is shameful that completely baseless rumours are being spread about me, I have been advocating and promoting yogic and Ayurvedic way of life for decades now such tactics won’t work to tarnish my image. My people know me and…
— Kangana Ranaut (@KanganaTeam) April 8, 2024
తాజావార్తలు
-
CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్‌లు వైరల్
-
ACB Raids : ట్రాన్స్‌కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
-
Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ ‘టెక్నీషియన్‌ను మార్చాలన్న’ దళపతి విజయ్.. కానీ!
-
Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
ట్రెండింగ్
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!