MLC Kavitha: కవిత జ్యుడీషియల్ కస్టడీ జులై 3 వరకూ పొడిగింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. ఈసారి కస్టడీని మరో నెలపాటు పొడిగిస్తూ ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న కవితను జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో సోమవారం కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీని జూలై 3 వరకు పొడిగించిన రూస్ అవెన్యూ కోర్టు.. మరోవైపు సీబీఐ కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపుపై మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరగనుంది. ఇందుకోసం ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుకానున్నారు.
Read More: Medak: లోక్ సభ ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధం..
Also Read
- Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
- JP Nadda - CJP Leaders: నడ్డాతో సీజేపీ నాయకుల భేటీ.. సీజేపీ డిమాండ్స్ ఇవే!
- West Bengal: సెప్టెంబర్ 1 నుంచి బెంగాల్లో కొత్త రూల్.. మాతృ భాషకు పట్టం కట్టిన సీఎం సువేందు అధికారి!
- Abhijeet Dipke: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే అరెస్ట్..
కాగా.. మద్యం కేసులో కవితను ఈడీ అధికారులు మార్చి 15న హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో అదుపులో తీసుకున్నారు అధికారులు. ఈ కేసులో తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఆమెను ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ రెండు కేసుల్లోనూ ట్రయల్ కోర్టు ఆమెకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఇదిలా ఉండగా, ఏప్రిల్ 10న, కవితతో పాటు చరణ్‌ప్రీత్, దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్‌లను నిందితులుగా పేర్కొంటూ ఈడీ రూస్ అవెన్యూ కోర్టులో అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసింది.
Read More: Khammam: లోక్ సభ కౌంటింగ్ కు అంతా రెడీ.. స్ట్రాంగ్ రూమ్ ల దగ్గర మూడంచెల భద్రత
ఏప్రిల్ 29న ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించారు. అయితే.. కవిత, చరణ్‌ప్రీత్‌లు ఇప్పటికే జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నందున.. వారికి కోర్టు ప్రొడక్షన్ వారెంట్లు జారీ చేసింది. దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్‌లు జూన్ 3న కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది.అయితే కవిత జ్యుడీషియల్ కస్టడీ కూడా జూన్ 3తో ముగియనుంది. దీంతో సీబీఐ కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపుపై మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరగనుంది. మరి దీనిపై కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వనుందో ఉత్కంఠ వాతావరణం నెలకొంది.
Supreme Court: ఎమ్మెల్యే పిన్నెల్లిపై సుప్రీం సీరియస్.. కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లొద్దని ఆంక్షలు
తాజావార్తలు
-
New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
-
Naga Chaitanya : నాగార్జున నైజం బయటపెట్టిన నాగచైతన్య.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు!
-
Indian IPL Player: బిగ్‌షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
-
Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్‌కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!