సోనీ లివ్‌లో రాబోతున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘కన్‌ఖజురా’ టీజర్‌ను మే 2న విడుదల చేశారు. గోవా నేపథ్యంలో, అక్కడి నీడల్లో దాగిన నేరాల చుట్టూ తిరిగే ఈ కథ నిశ్శబ్దంలోని మోసాన్ని, దాచిన ప్రమాదాలను వెలికితీస్తుంది. విమర్శకుల ప్రశంసలు పొందిన ఇజ్రాయెల్ సిరీస్ ‘మాగ్పీ’ ఆధారంగా రూపొందిన ఈ హిందీ అనువాదం, భారతీయ సంస్కృతితో కూడిన భావోద్వేగ తీవ్రతను అందిస్తుంది. విడిపోయిన ఇద్దరు సోదరులు తమ చీకటి గతంతో పోరాడుతూ, జ్ఞాపకాలు, వాస్తవం మధ్య చిక్కుకుని నలిగిపోయే ఆసక్తికర కథాంశంతో ఈ సిరీస్ ఆకట్టుకుంటుంది.
అషు పాత్రలో నటించిన రోషన్ మాథ్యూ మాట్లాడుతూ, “‘కన్‌ఖజురా’లోని భావోద్వేగ తీవ్రత, గందరగోళంలోని నిశ్శబ్దం నన్ను ఆకర్షించాయి. అషు పాత్రలో అనేక పొరలున్నాయి—ఒక్కో క్షణంలో ఒక్కో విధంగా కనిపిస్తూ, లోపల నిశ్శబ్ద తుఫానును మోస్తుంది. ఈ కథ హృదయాల్ని తాకడమే కాక, మనసును వెంటాడుతుంది” అని అన్నారు.
అజయ్ రాయ్ నిర్మాణంలో, చందన్ అరోరా దర్శకత్వంలో రూపొందిన ‘కన్‌ఖజురా’లో మోహిత్ రైనా, రోషన్ మాథ్యూ, సారా జేన్ డయాస్, మహేష్ శెట్టి, నినాద్ కామత్, త్రినేత్ర హల్దార్, హీబా షా, ఉషా నద్కర్ణి తదితరులు నటించారు. ‘మాగ్పీ’ ఆధారంగా, యెస్ స్టూడియోస్ లైసెన్స్‌తో ఆడమ్ బిజాన్స్కీ, ఓమ్రీ షెన్హార్, డానా ఈడెన్ సృష్టించగా, డోనా అండ్ షులా ప్రొడక్షన్స్ నిర్మించింది.