NTV Telugu Site icon

Bengaluru Techie Suicide Case: కేసును పరిష్కరించేందుకు జడ్జి రూ.5 లక్షలు డిమాండ్ చేశారు..

Athul

Athul

Bengaluru Techie Suicide Case: బెంగళూరు టెకీ ఆత్మహత్య తర్వాత అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ సందర్భంగా అతుల్ సుభాష్ తండ్రి మాట్లాడుతూ.. సుభాష్ భార్య, ఆమె బంధువులు పెట్టే వేధింపులను తట్టుకోలేక తన కొడుకు సూసైడ్ చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. భార్య తనపై పెట్టిన కేసు నుంచి విముక్తి పొందాలంటే రూ.5లక్షలు ఇవ్వాలని అతుల్‌ సుభాష్‌ను జడ్జి డిమాండ్‌ చేసినట్లు అతని తండ్రి పవన్ కుమార్ ఆరోపించారు.

Read Also: Best 5G Smartphones: 25 వేల లోపు బెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్‌లు ఇవే.. ఫీచర్స్ అదుర్స్ అంతే!

అయితే, అతుల్ సుభాష్‌, నిఖిత సింఘానియాలకు 2019లో పెళ్లైంది.. ఆ తర్వాత కొన్నేళ్లకు ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చినట్లు అతుల్ తండ్రి పవన్ కుమార్ తెలిపారు. దీంతో నిఖిత.. సుభాష్‌ను విడిచి పెట్టి బెంగళూరు నుంచి ఉత్తర ప్రదేశ్‌కు వెళ్లింది. అక్కడే ఆమె తల్లి, సోదరుని సహాయంతో అతుల్‌తో పాటు మాపై అనేక తప్పుడు కేసులు పెట్టిందని చెప్పుకొచ్చారు. ఈ కేసు విచారణ కోసం తన కుమారుడు బెంగళూరు నుంచి ఉత్తరప్రదేశ్‌కి 40కి కంటే ఎక్కువ సార్లు వెళ్లి వచ్చాడని బాధితుడి తండ్రి వాపోయాడు.

Read Also: Triple Talaq: భార్య ఒంటరిగా వాకింగ్‌కు వెళ్తుందని ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త..

కాగా, న్యాయస్థానంలో కేసు విచారణ జరుగుతుండగా.. ఈ కేసును పర్యవేక్షిస్తున్న జడ్జి సమస్యను పరిష్కరించేందుకు రూ.5 లక్షలు అడిగారని అతుల్ సుభాష్ తండ్రి పవన్ కుమార్ ఆరోపించారు. దీంతో మధ్యవర్తిత్వం కోసం తాము రెడీనట్లు చెప్పుకొచ్చారు. ఆ సమయంలో మధ్యవర్తిత్వం వహించినందుకు ముందు రూ.20 వేల ఇవ్వాలని కోరాడు.. ఆ తర్వాత రూ.40వేలకు పెంచారని చెప్పుకొచ్చారు. అతనికి (సుభాష్‌) సెటిల్మెంట్ కావాలనుకుంటే రూ. 5 లక్షలు ఇవ్వాలని సదరు న్యాయమూర్తి డిమాండ్‌ చేసినట్లు పవన్ కుమార్ పేర్కొన్నారు.

Read Also: YS Avinash Reddy: సాగునీటి సంఘాల ఎన్నికల వివాదం.. వేములలో ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్‌ రెడ్డి అరెస్ట్

ఇక, అతుల్‌ సుభాష్‌ కేసు దర్యాప్తును బెంగళూరు మారతహళ్లి పోలీసులు వేగంగా విచారణ చేస్తున్నారు. మృతుని సోదరుడు బికాస్‌ కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదుతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుల కోసం యూపీలోని జౌన్‌పూర్‌కి వెళ్లారు. అక్కడ అతుల్‌ భార్య నిఖితా సింఘానియా, ఆమె తల్లి నిశా, సోదరుడు అనురాగ్, బంధువు సుశీల్‌ కోసం గాలించారు. బిహార్‌లో ఉండే మృతుని తల్లిదండ్రుల నుంచి కూడా పోలీసులు వాంగ్మూలం తీసుకున్నారు.

Show comments