NTV Telugu Site icon

JP Nadda: ఆమ్ ఆద్మీ పార్టీ రేపిస్టును.. థెరపిస్టు చేసింది..

Jp Nadda

Jp Nadda

JP Nadda criticizes Aam Aadmi Party: ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వర్సెస్ బీజేపీగా సాగుతోంది రాజకీయం. ఇరుపార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి.ఇదిలా ఉంటే ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఢిల్లీలో రాజకీయం వేడెక్కింది. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఢిల్లీలో ఆదివారం ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఢిల్లీలోని వజీర్ పూర్ ప్రాంతంలో విస్తృతంగా పర్యటించారు. ఈ నేపథ్యంలో ఆప్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

Read Also: Love Today OTT Release : లవ్ టుడే ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే

ఆప్ నాయకులు నిజాయితీపరులని చెప్పుకునే వారని.. అయితే ప్రస్తుతం ఆ పార్టీకి చెందిన మంత్రి సత్యేంద్ర జైన్ అవినీతికి పాల్పడి జైలులో ఉన్నారని.. వారు తీహార్ జైలును మసాజ్ సెంటర్ గా మార్చారని.. రేపిస్టును థెరపిస్టుగా మార్చారని వజీర్ పూర్ పారిశ్రామిక ప్రాంతంలో జరిగిన బహిరంగ సభలో విమర్శించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు వేయాలని ప్రజలను కోరారు జేపీ నడ్డా. ‘సంకల్ప్ పత్ర’పేరుతో మెనిఫెస్టో విడుదల చేసింది బీజేపీ. జేపీ నడ్డా వెంట ఎంపీ హర్షవర్థన్, ఇతర పార్టీ నేతలు ఉన్నారు. ప్రచారంలో ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా సహా వివిధ పార్టీల నేతలు కూడా ఉన్నారు.

మనీలాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న ఆప్ మంత్రి సత్యేందర్ జైన్ ఇటీవల జైలులో మసాజ్ చేయించుకోవడం వివాదాస్పదం అయింది. దీనికి సంబంధించిన వీడియోను బీజేపీ బయటపెట్టింది. అయితే ముందుగా ఆప్ ఈ చర్యను సమర్థించుకుంది. జైన్ ఆరోగ్యం బాగా లేకపోవడంతో మసాజ్ చేయించుకున్నాడని వెనుకేసుకొచ్చింది. ఆ తరువాత మసాజ్ చేసిన వ్యక్తి జైలులో రేపు కేసులో శిక్ష అనుభవిస్తున్నవాడిగా తేలింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ 250 వార్డుల్లోని ప్రజలకు చేరువకావాలని బీజేపీ ప్రచారం ప్రారంభించింది. కేంద్రమంత్రులు, కీలక నేతలు ప్రచారంలో పాల్గొననున్నారు. డిసెంబర్ 4న ఈ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 7న ఓట్ల లెక్కింపు ఉండనుంది.