Mirror Break: పగిలిన అద్దాన్ని ఇంట్లో ఉంచితే.. అరిష్టమా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చాలా మంది అద్దం విషయంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు.. అసలు అద్దం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
పగిలిన అద్దంలో ఎప్పుడూ కూడా ముఖాలు చూసుకోకూడదు. ఇంట్లో పగిలిన అద్దం లేదంటే మరకలు పడి మాసిపోయిన అద్దాన్ని ఉంచకూడదు. అద్దం లక్ష్మీదేవి అని చెబుతూ ఉంటారు. పూర్వం రోజుల్లో ఈ అద్దాలు లేకపోవడంతో వారి ప్రతిబింబాన్ని నదులు నీటి సరస్సులు అప్పుడు ముఖం సరిగ్గా కనిపించక పోయిన అశుభమనుకునేవారు. అద్దాలు వచ్చాకా అవి పగిలితే అశుభం అన్నట్టు మారిందంటారు. అద్దం అమ్మవారి స్వరూపం అని, గడియారం ఈశ్వర స్వరూపం అని విశ్వసిస్తారు. లక్షీ స్వరూపంగా భావించే అద్దం పగిలితే ఏదో కీడు జరుగుతుందనే సంకేతం అట. సంపద నష్టపోతారని, ఇంట్లో మనశ్సాంతి ఉండదని చెబుతారు. ఎందుకంటే అద్దంలో ఎప్పుడూ ఒకే బొమ్మ నిలకడగా ఉండదు. లక్ష్మీదేవి కూడా ఒకే దగ్గర ఉండిపోదంటారు. అద్దం ముక్కలైనట్టే సంపద చెల్లాచెదురు అయిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి..
Also Read
- Vinayaka Vrata Katha: 'వినాయక చవితి' నాడు విజ్ఞాలను తొలిగించే 'వినాయక వ్రత కథ' మీకోసం..!
- Ganesh Chaturthi 2026: ఇంట్లో గణపతిని ప్రతిష్ఠిస్తున్నారా..? దిశ, విగ్రహం, పూజ విషయంలో ఈ నియమాలు తప్పక పాటించండి..
- Ganesh Chaturthi 2026: బొజ్జ గణపయ్య ప్రతిష్ఠకు శుభ ముహూర్తం.. పూజా సామగ్రి.. పూజా విధానం ఇదే!
- Lakshmi Narayana Yoga: తులారాశిలో లక్ష్మీనారాయణ యోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
ఇంటికి ఎదురుగా ఎప్పటికి అద్దాన్ని పెట్టొద్దు.. అనుకూల శక్తులు అలానే వెనక్కి వెళ్ళిపోతాయి.. దైవ స్వరూపంగా భావించడం వల్లే మైల వచ్చినప్పుడు అద్దాన్ని వినియోగించనివ్వరు పెద్దలు. ఇంట్లో అద్దం పగిలిప్పుడు ఆ అరిష్టం పోవాలంటే ముత్తైదువులకు అద్దం దానం చేయాలి.. అద్దం మనను ప్రతిబింబిస్తుందని, అది పగిలిందంటే మన రూపం ఛిద్రమైనట్టే అంటే మరణించే సమయం ఆసన్నమైందని తెలసుకోవాలంటారు. పగిలిన అద్దంలో ముఖం చూసుకోవద్దనేది కూడా అందుకే చెబుతారు..
అమెరికా, ఐర్లాండ్ దేశాల్లోని కొన్ని ప్రాంతాలవారికి ఒక బలమైన నమ్మకం ఉంది. తెలిసినవాళ్లెవరైనా చనిపోతే, వెంటనే ఇంట్లో ఉన్న అద్దాలన్నిటి మీదా గుడ్డ కప్పేస్తారట. చనిపోయి వారి ఆత్మ వెంటనే ఈ లోకాన్ని విడిచిపెట్టి పోదని, తనవాళ్ల చుట్టూ తిరుగుతుందని, తనకు ఆశ్రయమిచ్చే మరో శరీరం కోసం వెతుకుతుందని, అది దొరికేవరకూ అద్దంలో తలదాచుకుంటుందని అంటారు. అప్పుడు ఎక్కడ ఆ ఆత్మ వచ్చి చేరుతుందో అని భయపడి అద్దాలను కప్పేస్తారట. వాస్తవానికి పగిలిన అద్దంలో చూసుకుంటే కళ్లకు మంచిది కాదంటారు.. ఆరోగ్య పరంగా చెబితే అర్థం కాదని ఇలా అరిష్టం అని చెబుతున్నారు..
- Tags
- devotional
- mirror
- Mirror Break
తాజావార్తలు
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Ajit Agarkar Future: బీసీసీఐలో ‘కోల్డ్ వార్’..! అజిత్ అగార్కర్ పదవిపై ఉత్కంఠ.. 48 గంటల్లో కీలక నిర్ణయం..?
-
Bushra Bano: ‘అస్సలాము అలైకుమ్, ఇన్షా అల్లా, జజాకల్లాహ్” అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేసిన IPS.. ఫిర్యాదు దాఖలు.!
-
Bethlehem Kudumba Unit: ‘లోకా: చాప్టర్ 1’ రికార్డ్ బద్దలు.. మలయాళంలో నంబర్ 1గా నివిన్ పౌలీ సినిమా!
-
Gurugram Road Rage: మహిళా బైకర్‌ను వెంబడించి ఢీకొట్టిన కారు? కెమెరాలో షాకింగ్ దృశ్యాలు
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?