కేంద్రంలో, బీహార్ రాష్ట్రంలో బీజేపీతో జేడియు పోత్తు ఉన్న సంగతి తెలిసిందే. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి. పొత్తులో భాగంగా కేంద్రంలో జేడియుకు కేంద్ర మంత్రి పదవి లభించిన సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే వచ్చే ఏడాది ఉత్తర ప్రదేశ్, మణిపూర్ రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికలపై జేడీయు దృష్టి సారించింది. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించింది. బీజేపీతో పొత్తులు కుదిరితే కలిసి పోటీ చేస్తామని, లేదంటే ఒంటరిగా పోటీకి దిగుతామని ప్రకటించింది. జేడీయును బీహార్‌కు మాత్రమే పరిమితం చేయాలని అనుకోవడం లేదని, ఇతర రాష్ట్రాల్లో కూడా పాగా వేసేందుకు పావులు కదుపుతున్నామని జేడీయు ప్రధాన కార్యదర్శి త్యాగి పేర్కొన్నారు.
Read: మహేశ్ సోదరి న్యూ ఇన్నింగ్స్ ‘మళ్లీ మొదలైంది’!