Earbud Burst: స్టూడెంట్ చెవిలో పేలిన జేబీఎల్ ఇయర్‌బడ్.. స్పందించిన కంపెనీ..
- స్టూడెంట్ చెవిలో పేలిన జేబీఎల్ ఇయర్‌బడ్..
- విద్యార్థిని ఆరోపణలపై స్పందించిన సంస్థ..
- విచారణకు ఆదేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Earbud Burst: రాజస్థాన్‌కు చెందిన ఒక విద్యార్థిని చెవిలో ఇయర్‌బడ్ పేలిపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ ఆడియో బ్రాండ్ జేబీఎల్‌కు చెందిన ఇయర్‌బడ్ తన చెవిలోనే పేలిందని ఆమె ఆరోపించడం సంచలనంగా మారింది. ఈ ఘటన తర్వాత వైర్‌లెస్ డివైజ్‌ల భద్రతపై అనేక కొత్త ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. జేబీఎల్ ట్యూన్ బీమ్ 2 ఇయర్‌బడ్‌ను తాను ఉపయోగించినట్లు ఆమె పేర్కొంది. ఆకాస్మత్తుగా పనిచేయడం ఆపేసిందని, కేవలం 15 నిమిషాల పాటు సాధారణ వాల్యూమ్ తోనే వింటున్నప్పుడు ఈ సంఘటన జరిగిందని ఆరోపించింది. పేలిపోవడానికి ముందు తనకు డ్రిల్లింగ్ మెషీన్ లాంటి ఫీలింగ్ వచ్చిందని ఆమె పేర్కొంది.
Read Also: Gopichand33: మ్యాచో స్టార్ గోపీచంద్ 33వ సినిమా అప్‌డేట్..
Also Read
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
- Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
చెవిలో ఇయర్‌డ్రమ్(టింపానిక్ మెమ్‌బ్రేన్)లో వాపు ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. చెవి లోపల పేలడంతో కర్ణభేరి వాపుకు గురైందని తెలిపారు. దీని వల్ల నొప్పి, అసౌకర్యం ఏర్పడినట్లు చెప్పారు. ఈ ఘటనపై స్టూడెంట్ ఫోటోలు, డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. జేబీఎల్ సరైన నాణ్యత లేని ప్రొడక్ట్ తయారు చేసిందని ఆమె ఆరోపించారు. నెల రోజుల క్రితం ఈ పరికరాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. వీటి వివరాలను కూడా ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు.
అయితే, ఈ ఘటనపై జేబీఎల్ విచారణ ప్రారంభించింది. విద్యార్థిని సోషల్ మీడియా పోస్ట్‌పై కంపెనీ స్పందిస్తూ.. ‘‘ మీ పరిస్థితి గురించి మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు, మేము మీ పోస్ట్ చూసి, తదుపరి చర్యలు తీసుకోవడానికి భారత్‌లోని మా టీంను మిమ్మల్ని నేరుగా సందప్రదిస్తుంది’’ అని రాసింది. స్టూడెంట్ పెట్టిన పోస్ట్‌పై నెటిజన్లు చాలా మంది స్పందించారు. కన్జూమర్ కోర్టుకు వెళ్లాల్సిందిగా ఒకరు సలహా ఇచ్చారు. భద్రత విషయంలో రాజీపడకూడదని పలువురు నెటిజన్లు జేబీఎల్‌కు సూచించారు.
JBL right side earphones bursted in my ear and lead to TM membrane inflammation
It was gifted to me by my sister one month back , JBL tune beams 2 @JBLaudio pic.twitter.com/HTvceq0y3R— A🕶 (@Capybara2233_) April 8, 2026
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
-
AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!