Lashkar Terrorist Killed In Encounter: జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు పెట్రేగిపోయారు. పుల్వామా, షోఫియాన్ జిల్లాల్లో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఆదివారం పుల్వామాలో సీఆర్పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులపైకి ఉగ్రవాదులు కాల్పలు జరిపారు. ఈ ఘటనలో విధి నిర్వహణలో ఉన్న ఒక పోలీస్ మరణించారు. సీఆర్పీఎఫ్ కు చెందిన సిబ్బంది గాయపడ్డారు. సంఘటన జరిగిన ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. పుల్వామాలోని పింగ్లాన వద్ద సీఆర్పీఎఫ్, కాశ్మీర్ పోలీసుల నాకా పార్టీపై ఉగ్రవాదులు దాడులు చేశారు.
Read Also: Mallikarjun Kharge: ఎన్నిక ఏకగ్రీవం అయితే మంచిదని శశిథరూర్‌కు చెప్పాను
ఇదే రోజు షోఫియాన్ లో జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాదిని మట్టుపెట్టాయి భద్రతా బలగాలు. ఈ ఘటన జరిగిన కొద్ది సేపటికే పుల్వామాలో ఉగ్రవాదుల దాడి జరిగింది. చనిపోయిన ఉగ్రవాదిని నసీర్ అహ్మద్ భట్ గా పోలీసులు గుర్తించారు. ఇతను షోపియాన్ జిల్లా నౌపోరా ప్రాంతానికి చెందినవాడు. ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో లో అహ్మద్ భట్ తప్పించుకున్నాడు. అనేక ఉగ్రవాద నేరాల్లో ఇతను పాల్గొన్నాడని కాశ్మీర్ ఏడీజీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి ఉగ్రవాద సాహిత్యం, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు రోజు శనివారం బారాముల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. దీంట్లో ఇద్దరు జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన టెర్రరిస్టులను హతమార్చాయి భద్రతాబలగాలు.
కాశ్మీర్ లోయలో ప్రధానం లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థలు హైబ్రీడ్ టెర్రరిజానికి పాల్పడుతున్నాయి. అమయాకులైన ప్రజలు, హిందువులు, వలస కూలీలు, కాశ్మీర్ పండిట్లే లక్ష్యంగా ఉగ్రదాడులకు పాల్పడుతున్నారు. గతంలో కాశ్మీర్ పండిట్ రాహుల్ భట్ తో పాటు స్థానికేతరులను, వలస కూలీలను దారుణంగా చంపారు. ఈ దాడులకు పాల్పడిన వ్యక్తులను భద్రతాబలగాలు వేటాడి వెంటాడి ఎన్ కౌంటర్లలో తేపేశారు.
