NTV Telugu Site icon

Jammu Kashmir: భారత్-పాక్ సరిహద్దుల్లో మందుపాతర పేలుడు..ఆరుగురు జవాన్లకు గాయాలు..

Jammu Kashmir

Jammu Kashmir

Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి జిల్లా నౌషేరా భవానీ సెక్టార్ వద్ద ల్యాండ్ మైన్ పేలింది. భారత్-పాక్ సరిహద్దు నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వద్ద మంగళవారం ప్రమాదవశాత్తు జరిగిన పేలుడులో ఆరుగురు భారత జవాన్లు గాయపడ్డారు. సాధారణ గస్తీలో భాగంగా జవాన్లు ఆ ప్రాంతం గుండా వెళ్తున్న క్రమంలో అనుకోకుండా మందుపాతర పేలడంతో ఈ ప్రమాదం జరిగింది.

Read Also: Adam Gilchrist: ‘బ్యాటింగ్‌పై దృష్టి పెట్టు.. జుట్టు మీద కాదు’.. భారత్ బ్యాటర్ పై కీలక వ్యాఖ్యలు

సైనిక వర్గాల ప్రకారం.. సైనికులు సున్నితమైన ప్రాంతాల్లో తమ గస్తీని నిర్వహిస్తుండగా, అందులో ఒకరు పొరపాటున మందుపాతరపై కాలు వేయడంతో పేలుడు సంభవించింది. ఈ పేలుడు కారణంగా ఆరుగురు సైనికులకు స్వల్ప గాయాలయ్యాయి. వారికి వెంటనే వైద్య సహాయం అందించారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. గాయపడిన వారి పరిస్థితి బాగానే ఉందని, తదుపరి వైద్య కోసం సైనికులను సమీపంలోని వైద్య కేంద్రానికి తరలించారు.

గతంలో అనేక ఘర్షణలకు ఈ నౌషేరా సెక్టార్ కేంద్రంగా ఉంది. ఉగ్రవాదులు సరిహద్దు కంచెను దాటి రావడం, పాకిస్తాన్ బలగాల కాల్పులు కారణంగా ఎల్‌ఓసీ సమీపంలోని ఈ ప్రాంతం హై-సెక్యూరిటీ జోన్‌గా ఉంది. సరిహద్దు భద్రతా చర్యల్లో భాగంగా మందుపాతరలను అమర్చుతారు. అనుకోకుండా గస్తీ సమయంలో వీటిపై కాలు వేయడంతో తాజా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సంఘటనపై ఖచ్చితమైన కారణాన్ని గుర్తించడానికి, ఈ ప్రాంతంలో సిబ్బంది భద్రతను నిర్ధారించడానికి సైన్యం దర్యాప్తు చేస్తోంది. ఈ ప్రాంతంలో భద్రతను పెంచడంతో పాటు అదనపు ముందు జాగ్రత్త చర్యల్ని తీసుకుంటున్నారు.