Site icon NTV Telugu

S Jaishankar: ‘‘చెడ్డ పొరుగువారు’’.. పాకిస్తాన్‌పై దాడి చేసే హక్కు భారత్‌కు ఉంది..

Jaishankar

Jaishankar

S Jaishankar: విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాకిస్తాన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. పాకిస్తాన్‌ను ‘‘చెడు పొరుగుదేశం’’గా అభివర్ణించారు. ఉగ్రవాదం నుంచి తమ ప్రజల్ని రక్షించుకునే హక్కు భారత్‌కు ఉందని చెప్పారు. పరోక్షంగా ఉగ్రవాదానికి పాల్పడితే దాడులు చేస్తామని హెచ్చరించారు. మద్రాస్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో విద్యార్థులతో మాట్లాడుతూ, “మనం ఏమి చేయాలో, ఏమి చేయకూడదో ఎవరూ చెప్పలేరు” అని మంత్రి ఆపరేషన్ సిందూర్‌ను ఉద్దేశించి అన్నారు.

గతేడాది భారత్ ఆపరేషన్ సిందూర్ ద్వారా తన ప్రజలను ఉగ్రవాదం నుంచి రక్షించుకునే హక్కును వినయోగించుకుంది. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్ పాకిస్తాన్‌పై భీకర దాడులు చేసింది. పీఓకే, పాక్ లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 9 ఉగ్రవాద స్థావరాలు, వాటి కార్యాలయాలపై దాడులు చేసి, వందలాది మంది ఉగ్రవాదుల్ని హతమార్చింది. పాకిస్తాన్ సైన్యం, భారత్‌పై దాడి చేయడానికి ప్రయత్నిస్తే, పాక్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన 11 ఎయిర్ బేస్‌లను ధ్వంసం చేసింది.

Read Also: 6 ఎయిర్‌బ్యాగ్స్, కొత్త డిజైన్, కొత్త టెక్నాలజీతో మార్కెట్‌లోకి వచ్చేసిన Kia Seltos 2026.. ఫీచర్స్ ఇవే..!

అయితే, పాక్ విధానాలను ఎండగడుతూ జైశంకర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ‘‘మీకు చెడ్డ పొరుగువాడు ఉండొచ్చు. దురదృష్టవశాత్తు, మనకు చెడ్డ పొరుగువారు ఉంటారు. మీరు పశ్చిమాన ఉన్నవారి వైపు చూస్తే, ఒక దేశం ఉద్దేశపూర్వకంగా, నిరంతరంగా, పశ్చాత్తాపం లేకుండా ఉగ్రవాదాన్ని కొనసాగించాలని నిర్ణయించుకుంటే, దేశ ప్రజలను ఉగ్రవాదం నుండి రక్షించే హక్కు మనకు ఉంది. మేము ఆ హక్కును ఉపయోగిస్తాము” అని జైశంకర్ అన్నారు. ఆ హక్కును మనం ఎలా వినియోగించుకుంటామనేది మన ఇష్టం అని, మనం ఏం చేయాలి, ఏం చేయకూడదని ఏ దేశం కూడా మనకు చెప్పలేదని, మనం మనల్ని రక్షించుకోవడానికి చేయాల్సిందంతా చేస్తాము అని అన్నారు. సిందూ జలాలా ఒప్పందం నిలిపివేత గురించి మాట్లాడుతూ.. నాతో నీటిని పంచుకోండి, కానీ నేను మీపై ఉగ్రవాదాన్ని కొనసాగిస్తానని చెబితే మంచి సంబంధాలు ఉండవని అన్నారు.

Exit mobile version