Site icon NTV Telugu

S Jaishankar: కాల్పుల విరమణ, ట్రంప్ కామెంట్స్‌పై జైశంకర్ కీలక వ్యాఖ్యలు..

Jaishankar

Jaishankar

S Jaishankar: ఆపరేషన్ సిందూర్‌, పాకిస్తాన్‌తో కాల్పుల విరమణ గురించి భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈ రోజు మాట్లాడారు. కాల్పుల విరమణకు ఎవరు పిలుపునిచ్చారనే విషయం స్పష్టంగా ఉందని పాకిస్తాన్‌ని ఉద్దేశించి ఆయన అన్నారు. రెండు దేశాల మధ్య శాంతికి అమెరికా మధ్యవర్తిత్వం వహించిందని డొనాల్డ్ ట్రంప్ చెప్పిన నేపథ్యంలో జైశంకర్ వ్యాఖ్యలు వచ్చాయి. ‘‘మేము పాకిస్తాన్‌ సైన్యంపై దాడి చేయలేదు. కాబట్టి పాక్ సైన్యం జోక్యం చేసుకోకుండా ఉండాలి. కానీ వారు ఆ సలహా తీసుకోలేదు’’ అని అన్నారు.

Read Also: Pawankalyan : ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ పాల్గొనేది అప్పటి నుంచే..!

అలాగే, ఉపగ్రహ చిత్రాలు ద్వారా పాకిస్తాన్‌కి ఎంత నష్టం జరిగిందనేది స్పష్టంగా ఉందని ఆయన చెప్పారు. మే 07న తగ్గడానికి సిద్ధంగా లేని వారు, మే 10న మాట్లాడటానికి సిద్ధమయ్యారని పాకిస్తాన్‌ని ఉద్దేశించి అన్నారు. కాబట్టి, కాల్పుల విరమణ ఎవరు కోరుకున్నారు అనేది స్పష్టంగా ఉందని అన్నారు.

భారతదేశం ‘‘జీరో టారిఫ్స్’’తో వాణిజ్య ఒప్పందాన్ని ఆఫర్ చేసిందనే ట్రంప్ వ్యాఖ్యలపై జై శంకర్ స్పందించారు. భారత్-యూఎస్ మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్నాయని అన్నారు. ‘‘ఇవి సంక్లిష్టమైన చర్చలు. ప్రతీదీ జరిగే వరకు ఏమీ నిర్ణయించబడదు. ఏదైనా వాణిజ్య ఒప్పందం పరస్పరం ప్రయోజనకంగా ఉండాలి. అది రెండు దేశాలకు మేలు జరగాలి. వాణిజ్య ఒప్పందం నుంచి మనం ఆశించేది అదే.’’ అని జైశంకర్ అన్నారు.

Exit mobile version