Site icon NTV Telugu

Jagdeep Dhankhar: ఆ మాటే కేంద్ర పెద్దలకు కోపం తెప్పించింది.. ధన్‌ఖర్ రాజీనామా మిస్టరీ ఇదే!

Jagdeep Dhankhar

Jagdeep Dhankhar

జగదీప్ ధన్‌ఖర్.. జూలై 21 సాయంత్రం వరకు భారతదేశ ఉపరాష్ట్రపతి. ఆరోజే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇక రాజ్యసభలో ధన్‌ఖర్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. అందరితో కులాసాగానే మాట్లాడారు. కానీ కొన్ని నిమిషాల్లోనే పరిణామాలు తల్లకిందులయ్యాయి. ధన్‌ఖర్ వ్యతిరేకంగా కేంద్ర పెద్దలు ప్రణాళికలు రచించారు. అయితే ముప్పు ముందే గ్రహించి.. ధన్‌ఖర్ అనూహ్యంగా తప్పుకున్నారు. అనారోగ్యం పేరుతో ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ పంపించారు. ఇంత సడన్‌గా రాజీనామా చేయడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. దీని వెనుక చాలా కథే ఉందంటూ గుసగుసలాడారు. తాజాగా రాజీనామా వెనుక ఉన్న మిస్టరీ వీడింది.

ఇది కూడా చదవండి: Karnataka: ఓ అక్క మరణశాసనం.. వ్యాధి బయటకు తెలియకూడదని తమ్ముడు హత్య

జూలై 21న సాయంత్రం రాజ్యసభ సెక్రటేరియట్‌కు ఒక సీలు కవరు వచ్చింది. అందులో ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌గా ఉన్న ధన్‌ఖర్ ప్రయాణం ముగిసినట్లుగా అందులో పేర్కొంది. విషయం తెలిసిన ధన్‌ఖర్ ఆ రాత్రే ఆయన పదవికి రాజీనామా చేశారు. అనారోగ్యంతో తప్పుకున్నట్లు ప్రకటించారు. అయితే రాజీనామా వెనుక చాలా కథే ఉంది. కేంద్ర పెద్దలతో ఆయనకు సఖ్యత చెడిపోవడం వల్లే ఈ పరిణామాలకు దారి తీసినట్లుగా సమాచారం.

జూలై 21 ఉదయం ధన్‌ఖర్ రాజ్యసభ సలహా కమిటీ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్ గురించి ప్రధానమంత్రి సభలో ఎప్పుడు మాట్లాడుతారో ప్రభుత్వాన్ని అడగమని మంత్రులకు ధన్‌ఖర్ సూచించారు. ఈ ప్రశ్న మంత్రులకు ఎక్కడలేని చిరాకు తెప్పించింది. ప్రధానమంత్రి సభలో ఎప్పుడు మాట్లాడాలో చైర్మన్ లేదా ప్రతిపక్షం నిర్ణయించలేరని మంత్రులు తేల్చి చెప్పారు.

ఇది కూడా చదవండి: War 2 : వార్ 2 హీరోల రెమ్యునరేషన్ లెక్కలు లీక్.. ఎన్టీఆర్ పారితోషికం చూసి నెటిజన్లు షాక్ 

అయితే మొదటి బీఏసీ సమావేశం తర్వాత ధన్‌ఖర్ భోజనానికి ఇంటికి వెళ్లారు. ఆ సమయంలోనే ధన్‌ఖర్‌కు సీనియర్ మంత్రి రెండు సార్లు ఫోన్ చేశారు. కానీ ధన్‌ఖర్ లిఫ్ట్ చేయలేదు. మంత్రితో మాట్లాడేందుకు నిరాకరించారు. ఈ వ్యవహారమే కేంద్ర పెద్దలకు మరింత కోపం తెప్పించింది. అంతే అదే ఆయనకు లాస్ట్ డే అయిపోయింది. ఇక ధన్‌ఖర్ అధ్యాయం ముగిసిందని కేంద్రం తేల్చేసింది. తిరిగి సాయంత్రం 4 గంటలకు ధన్‌ఖర్ రాజ్యసభకు వచ్చారు. జస్టిస్ యశ్వంత్ వర్మపై ప్రతిపక్షాలు ఇచ్చిన ప్రతిపాదనను ప్రస్తావించారు. అప్పటికే కేంద్ర పెద్దలు ఉపరాష్ట్రపతికి వ్యతిరేకంగా ప్రణాళికలు రచించారు. పదవీచ్యుతుని చేయడానికి ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 4:30 గంటలకు బీఏసీ రెండవ సెషన్ ప్రారంభమైంది. దీనికి కేంద్రం నుంచి ఏ ప్రతినిధి హాజరుకాలేదు. అప్పటికే ఎన్డీఏకు చెందిన రాజ్యసభ ఎంపీలంతా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కార్యాలయంలో సమావేశమయ్యారు. ధన్‌ఖర్ తొలగింపునకు సంతాకాలు సేకరించారు. 134 మంది మద్దతు ఇచ్చారు. ఆరోజే ధన్‌ఖర్ ప్రస్థానాన్ని ముగించాలని ఏర్పాట్లు చేసుకున్నారు. ఎన్డీఏ ప్రతిపాదనను సీలు కవరులో న్యాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్‌కు అందజేశారు. అనంతరం చైర్మన్ చాంబర్‌కు తీసుకెళ్లి.. ఆ కవరును సాయంత్రం 4:50 గంటలకు రాజ్యసభ సచివాలయానికి సమర్పించారు. అయితే ఇంతలోనే కేంద్ర పెద్దలు పన్నిన కుట్ర ఓ బీజేపీ ఎంపీ.. ధన్‌ఖర్ చెవిలో పడేశారు. కేంద్ర పెద్దల చేత గెంటివేయబడేకంటే.. మర్యాదగా తప్పుకోవడం మంచిదని భావించి ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసి ప్రశాంతంగా ప్రస్థానాన్ని ముగించారు.

Exit mobile version