భారత మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్‌కు కేంద్రం మరో షాక్ ఇచ్చింది. ధన్‌ఖర్ కోసం బుక్ చేసిన మూడు బుల్లెట్ ప్రూప్ కార్లను కేంద్రం నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు వర్గాలు పేర్కొన్నాయి.
ఇది కూడా చదవండి: Gambhir Vs Pitch Curator: హలో మాస్టారు మాకు కూడా రూల్స్ తెలుసండి.. ఓవల్ పిచ్ క్యూరేటర్పై గంభీర్, గిల్ గరం..!
ఇటీవల అనూహ్యంగా ఉపరాష్ట్రపతి పదవికి ధన్‌ఖర్ రాజీనామా చేశారు. కేంద్రం తనకు వ్యతిరేకంగా ఉందన్న ముందస్తు అప్రమత్తతతో ముందుగానే ఉపరాష్ట్రపతి పదవికి ధన్‌ఖర్ రాజీనామా చేశారు. అయితే వయసు రీత్యా గత సంవత్సరం కొత్త బుల్లెట్ ప్రూప్ వాహనాలు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ధన్‌ఖర్ కోరారు. పరిశీలించాలంటూ జూన్‌లో హోంమంత్రిత్వ శాఖ ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపింది. అయితే నవంబర్ నాటికి వాహనాలు ఏర్పాటు చేసుకోవాలని ధన్‌ఖర్ భావించారు. అయితే ఆశ్చర్యకరంగా జూలై 22న సాయంత్రం అనారోగ్య రీత్యా ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే ధన్‌ఖర్ పెట్టిన ప్రతిపాదనను తాజాగా కేంద్రం నిలిపివేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Donald Trump: భారత్, రష్యాపై డొనాల్డ్ ట్రంప్ ఫైర్.. టారిఫ్స్కు సిద్ధం కావాలని హెచ్చరిక!
కేంద్రంతో ధన్‌ఖర్‌కు సఖ్యత చెడినట్లుగా తెలుస్తోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూన్ 22న ప్రారంభమయ్యాయి. అయితే ఆ రోజు ధన్‌ఖర్ బాగానే ఉన్నారు. అయితే విపక్షాలు తీసుకొచ్చిన ప్రతిపాదనను ధన్‌ఖర్ ఆమోదించడం కేంద్రానికి నచ్చలేదు. దీంతో ఆయన్ను పదవి నుంచి తప్పించాలని కేంద్రం కుట్ర పన్నింది. అయితే ముందే గ్రహించి ధన్‌ఖర్ పదవి నుంచి తప్పుకున్నారు.