Israel: ఇరాన్ దాడి చేస్తుందనే, గాజా నుంచి ఇజ్రాయిల్ దళాల ఉపసంహరణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel: గాజా దక్షిణ ప్రాంతం నుంచి ఇజ్రాయిల్ పాక్షికంగా తన దళాలను ఉపసంహరించుకుంది. ఖాన్ యూనిస్ నగరం నుంచి ఇజ్రాయిల్ కొంత మంది సైనికులను బయటకు తీసుకువస్తున్నట్లు మిలిటరీ అధికారులు ఆదివారం తెలిపారు. రఫా బార్డర్ వద్ద మెరుగైన మానవతా కార్యక్రమాల కోసం ఈ చర్య తీసుకున్నట్లు ఇజ్రాయిల్ తెలుపుతోంది. అక్టోబర్ 7న ఇజ్రాయిల్-హమాస్ మధ్య ప్రారంభమైన గాజా యుద్ధం ప్రస్తుతం 7వ నెలకు చేరుకుంది. మరోవైపు సంధి వైపు చర్చలు జరుగుతున్నాయి.
అంతకు ముందు గాజా దక్షిణ భాగంలో ఈజిప్టు సరిహద్దుల్లో ఉన్న రఫాపై తాము దాడి చేస్తామని గత కొన్ని వారాలుగా ఇజ్రాయిల్ చెబుతూ వస్తోంది. అయితే, ఆ ప్రాంతంలో మిలియన్ మంది జనాభా ఉండటంతో అమెరికా, ఇతర దేశాలు ఈ చర్యల్ని సమీక్షించాలని ఇజ్రాయిల్‌ని కోరాయి. తీరా ఆ ప్రాంతం నుంచే బలగాల ఉపసంహరణ జరిగింది.
Also Read
- Abhijit Dipke: "రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి".. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
- CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
- Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
- Woman Sarpanch Candidate Promises: నన్ను గెలిపించండి.. మీ పెళ్లి చేసే బాధ్యత నాది..! సర్పంచ్ అభ్యర్థి హామీ వైరల్
Read Also: KL Rahul: 160 ప్లస్ స్కోరు చేసిన ప్రతి మ్యాచ్‌లో విజయం సాధించడం బాగుంది: కేఎల్ రాహుల్
ఇదిలా ఉంటే, ఇజ్రాయిల్ పాక్షిక ఉపసంహరణ ఇరాన్ దాడి చేస్తుందనే అనుమానాల నేపథ్యంలో జరిగినట్లు తెలుస్తోంది. ఇటీవల సిరియా డమాస్కస్‌పై ఇజ్రాయిల్ వైమానిక దాడులు నిర్వహించింది. ఇరాన్ ఎంబసీ లక్ష్యంగా జరిపిన దాడిలో ఇరానియన్ కుడ్స్ ఫోర్స్ కమాండర్ జనరల్ మహ్మద్ రెజా జహేదీ మరణించారు. ఇరాన్ అత్యున్నత మిలిటరీ అధికారి చనిపోవడంతో ఆ దేశం ఇజ్రాయిల్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉంది. 2020లో యూఎస్ డ్రోన్ దాడిలో ఖుద్స్ ఫోర్స్ కమాండర్ మేజర్ జనరల్ ఖాసిం సులేమానీ మరణించారు. ఈ దాడి తర్వాత రెజా జహేదీ మరణం అత్యున్నత స్థాయి హత్యగా పరిగణించబడుతోంది.
ఈ నేపథ్యంలోనే ఇజ్రాయిల్ తన బలగాలను గాజా నుంచి ఉపసంహరించుకుందనే వాదనలు వినిపిస్తున్నాయి. రంజాన్ తర్వాత ఎప్పుడైనా ఇరాన్ దాడి చేయవచ్చని ఇజ్రాయిల్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో బాంబ్ షెల్టర్లను ఏర్పాటు చేయడంతో పాటు, జీపీఎస్ నావిగేషన్ వ్యవస్థకు అంతరాయాన్ని సృష్టిస్తోంది. ఇలా చేయడం వల్ల గైడెడ్ మిస్సైల్స్, డ్రోన్ల దాడిని అరికట్టవచ్చని ఇజ్రాయిల్ భావిస్తోంది.
తాజావార్తలు
-
IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్‌లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
-
Abhijit Dipke: “రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి”.. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
-
Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!