Site icon NTV Telugu

Rahul Gandhi: రాహుల్ గాంధీకి హిండెన్‌బర్గ్‌తో సంబంధం.. “మొసాద్” ఆపరేషన్‌పై సంచలన నివేదిక..

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: ఇజ్రాయిల్ గూఢచార సంస్థ “మొసాద్” ఆపరేషన్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హిండెన్‌బర్గ్ సంస్థ పలుమార్లు అదానీని లక్ష్యం చేసుకుంటూ సంచలన నివేదికలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నివేదికల ఆధారంగా మన దేశంలో ప్రతిపక్షాలు అధికార బీజేపీపై తీవ్ర విమర్శలు చేశాయి. అయితే, ఈ వ్యవహారంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాత్ర ఉన్నట్లు మొసాద్ కనుగొంది. రాహుల్ గాంధీ అదానీని లక్ష్యంగా చేసుకుని హిండెన్‌బర్గ్‌తో ‘‘సమన్వయం’’ చేసుకున్నట్లు ఆరోపించింది. కాంగ్రెస్, హిండెన్ బర్గ్ మధ్య సమన్వయానికి సంబంధించిన ఆధారాలను మొసాద్ కోరిందని నివేదిక పేర్కొంది.

Read Also: Abir Gulaal: పాక్ యాక్టర్ ఫవాద్ ఖాన్ ‘‘బాలీవుడ్’’ సినిమాపై నిషేధం.!

అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ జనవరి 2023 నివేదికలో, అదానీ గ్రూప్ స్టాక్ మానిప్యులేషన్‌కి పాల్పడిందని ఆరోపించింది. అయితే, ఈ కథనాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయిల్ నిఘా సంస్థ మొసాద్ ఒక రహస్య ఆపరేషన్ నిర్వహించినట్లు స్పుత్నిక్ ఇండియా నివేదిక పేర్కొంది. అయితే, హిండెన్‌బర్గ్ ఈ ఏడాది తన కార్యకలాపాలను మూసేస్తున్నట్లు ప్రకటించింది.

నివేదిక ఆరోపించిన దాని ప్రకారం, ఈ ఆపరేషన్ ద్వారా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయని నివేదిక పేర్కొంది. గౌతమ్ అదానీ, ప్రధాని నరేంద్రమోడీని టార్గెట్ చేసేందుకు రాహుల్ గాంధీ, హిండెన్‌బర్గ్‌తో మధ్య సంబంధాలు ఉన్నట్లు పేర్కొంది. ఇజ్రాయిల్ నిఘా సంస్థ మొసాద్ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు, రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడైన సామ్ పిట్రోడా హోమ్ సర్వర్లను లక్ష్యంగా చేసుకుని రహస్య ఆపరేషన్ నిర్వహించిందని స్పుత్నిక్ ఇండియా నివేదిక పేర్కొంది. జనవరి 2023లో, హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్ సంక్లిష్టమైన అకౌంటింగ్ పద్ధతులు మరియు ఆఫ్‌షోర్ షెల్ కంపెనీల నెట్‌వర్క్ ద్వారా తన స్టాక్ ధరలను కృత్రిమంగా పెంచిందని ఆరోపించింది.

Exit mobile version