Israel: అమెరికా-ఇరాన్ ఒప్పందంతో ఇజ్రాయెల్‌కు నష్టమే.. రాయబారి రూవెన్ అజార్ కీలక వ్యాఖ్యలు
- అమెరికా-ఇరాన్ ఒప్పందంతో ఇజ్రాయెల్‌కు నష్టమే
- రాయబారి రూవెన్ అజార్ కీలక వ్యాఖ్యలు
- భవిష్యత్‌లో కొత్త సంక్షోభాలు ఉంటాయని హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందంపై ఇజ్రాయెల్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమం, ప్రాంతీయ ఉగ్రవాద సంస్థలకు అందిస్తున్న మద్దతు వంటి కీలక అంశాలు ఒప్పందంలో ప్రస్తావించకపోవడంతో తమ భద్రతా ప్రయోజనాలు దెబ్బతిన్నాయని భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ వ్యాఖ్యానించారు.
ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అమెరికా-ఇరాన్ ఒప్పందం కొన్ని కీలక భద్రతా అంశాలను పక్కన పెట్టిందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘బాలిస్టిక్ క్షిపణుల విషయంలో ఇజ్రాయెల్ ప్రయోజనాలు దెబ్బతిన్నాయి. ఇజ్రాయెల్‌కు ప్రధాన సవాలు ఇప్పటికీ ఇరాన్ క్షిపణి కార్యక్రమమే. అలాగే ఇరాన్ తన ప్రాక్సీ సంస్థలకు అందిస్తున్న మద్దతు కూడా తీవ్రమైన భద్రతా సమస్యగా మిగిలింది’’ అని అజార్ స్పష్టం చేశారు. ఇరాన్ మద్దతుతో పనిచేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హిజ్బుల్లా, హమాస్ వంటి సంస్థలను ప్రస్తావిస్తూ.. ఈ అంశాలను విస్మరించడం భవిష్యత్తులో మరిన్ని ఘర్షణలకు దారితీయవచ్చని హెచ్చరించారు.
Also Read
అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం (MoU) అణు కార్యక్రమంపై దృష్టి సారించినప్పటికీ.. ఇరాన్ క్షిపణి సామర్థ్యాలు, ప్రాంతీయ ప్రభావాన్ని పెంచే చర్యలపై స్పష్టమైన నిబంధనలు లేకపోవడం ఇజ్రాయెల్‌లో ఆందోళనకు కారణమవుతోంది. ఇలాంటి కీలక భద్రతా అంశాలను పరిష్కరించకుండా శాంతి ఒప్పందాలు కుదుర్చుకోవడం భవిష్యత్తులో కొత్త సంక్షోభాలకు దారితీయవచ్చని రూవెన్ అజార్ అభిప్రాయపడ్డారు. అమెరికా-ఇరాన్ ఒప్పందంపై ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రభుత్వం పలు సందేహాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో రాయబారి తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!