Site icon NTV Telugu

Israel Backs India: ఇండియాకు ఇజ్రాయెల్ బాసట.. దాడులు కొనసాగించాలని సూచన!

Isreal

Isreal

Israel Backs India: పాకిస్తాన్ పై దాడులు తప్పవని భారత ప్రభుత్వం గత కొన్ని రోజులుగా చెబుతునే వస్తుంది. అన్నట్లుగానే మంగళవారం అర్థరాత్రి పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలపై ఇండియన్ ఆర్మీ దాడులకు దిగింది. మొత్తం 9 ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని విజయవంతంగా ధ్వంసం చేసింది.

Read Also: Operation Sindoor: ఉదయం 10 గంటలకు భారత్ సైన్యం మీడియా సమావేశం..

ఇక, పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం దాడులకు ఇజ్రాయెల్ బాసటగా నిలిచింది. ఉగ్రవాదంపై పోరాటంలో భారతదేశానికి మద్దతుగా ఉంటామని హామీ ఇచ్చారు. ఉగ్రవాదులను నాశనం చేసేందుకు భారత్ ఇలాగే దాడులు కొనసాగించాలని ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ ఎక్స్ వేదిగా పోస్ట్ చేశారు. ఇండియా ఆత్మరక్షణ కోసమే ఈ దాడులు చేసింది.. వారికి మేము అండగా ఉంటామని పేర్కొన్నారు. అమాయకులపై టూరిస్టులపై ఉగ్రదాడికి పాల్పడిన పాకిస్తాన్ కి తగిన బుద్ధి చెప్పాలని ఇజ్రాయెల్ రాయబారి సూచించారు.

Read Also: ‘Tourist Family’ : నాని హిట్ 3, సూర్య ‘రెట్రో’ ని వెనక్కి నెట్టిన ‘టూరిస్ట్ ఫ్యామిలీ’..

మరోవైపు, టర్కీ పాకిస్తాన్‌కు సంఘీభావం తెలిపింది. పాక్ లో క్షీణిస్తున్న ప్రాంతీయ భద్రతా పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా టర్కీ విదేశాంగ మంత్రి హకన్ ఫిదాన్ సైతం పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్‌కు ఫోన్ చేసి తాజా పరిణామాలపై చర్చించారు. భారత దళాలు చేసిన దాడిని వివరించినట్లు తెలుస్తుంది. కాగా, మారుతున్న పరిస్థితిపై సన్నిహిత సమన్వయంతో ఉండటానికి ఇరువురు నాయకులు అంగీకరించారు.

Exit mobile version