సీనియర్ హీరోయిన్ సిమ్రాన్, సీనియర్ యాక్టర్ శశికుమార్, పాపులర్ కమెడియన్ యోగి బాబు తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘టూరిస్ట్ ఫ్యామిలీ’. నూతన దర్శకుడు అభిషాన్ జీవింత్ రూపొందిన ఈ సినిమాను నాజెరత్ పసిలాన్, మగేష్ రాజ్ పసిలాన్, యువరాజ్ గణేషన్ నిర్మించారు. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో రూపొందిన ఈ మూవీ మే 1న గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఇక మొత్తం అరవ నటీనటులే అయినా సరే, ఈ మూవీ పరిమితులన్నీ దాటుకుని వసూళ్ల రచ్చ చేస్తుంది. అదేమీ పాతిక కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న హీరో నటించిన సినిమా కాదు. దర్శకుడికి పట్టుమని పాతికేళ్లు కూడా లేవు. అలాంటిది ఈ మూవీ ఇటు హిట్ 3 ని, రెట్రో ని వెన్నక్కి నేటేసింది..
Also Read : Rishabh : ‘కాంతారా చాప్టర్ 1 షూట్ లో మరో అపశృతి ..
సూర్య రెట్రో, నాని హిట్ 3 ది థర్డ్ కేస్ తో పాటు విడుదలైన ఈ చోటా ఎంటర్ టైనర్ కేవలం తమిళంలో మాత్రమే రిలీజైనప్పటికీ, కలెక్షన్ల పరంగా వీక్ డేస్‌లో, మిగిలిన వాటిని డామినేట్ చేసింది. ఇక సోమవారం బుక్ మై షో ట్రెండ్స్ గమనిస్తే ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ కి 66 వేల టికెట్లు అమ్ముడుపోగా, హిట్ త్రీ కి 59 వేలు, రెట్రో కి 35 వేల టికెట్లు సేలయ్యాయి. కేవలం ఒక భాషలోనే రిలీజ్ చేసిన చిన్న చిత్రం ఇంత రచ్చ చేస్తే. మల్టీ లాంగ్వేజెస్‌లో వచ్చిన మిగిలిన రెండూ దానికన్నా కింది స్థాయిలో ఉండటం గమనార్హం. ఇక ఇటీవల కాలంలో నిర్మాతలు తమ సినిమాలు బాగా ఆడకపోతే సీజన్, రివ్యూలు, క్రికెట్, ఎండల మీదకు తోసేస్తున్నారు తప్ప, తమ లోటుపాట్లని విశ్లేషించుకోవడం లేదు. ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో తెలుసుకోవడం లేదు.