Site icon NTV Telugu

Delhi: దీపావళి నాడు ఢిల్లీలో భారీ దాడులకు ఐసిస్ ప్లాన్.. వెలుగులోకి సంచలన విషయాలు

Isis

Isis

దేశ రాజధాని ఢిల్లీలో భారీ కుట్రకు ప్లాన్ చేసిన ఐసిస్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను శుక్రవారం ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని సాదిక్ నగర్‌కు చెందిన ఎండీ అద్నాన్ ఖాన్, అలియాస్ అబూ ముహారిబ్ (19), భోపాల్‌కు చెందిన అద్నాన్ ఖాన్ అలియాస్ అబూ మొహమ్మద్ (20) అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని స్పెషల్ పోలీసులు విచారించారు. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీపావళి (20-10-2025)కి ఢిల్లీలో భారీ దాడులకు ప్రణాళిక రచించినట్లు అధికారులు తెలిపారు.

ఇద్దరు ఉగ్రవాదులు ఐసిస్ ఉగ్రవాద సంస్థకు విధేయత చూపుతున్నట్లు ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. నిందితులిద్దరూ సిరియా సరిహద్దులో ఉన్నట్లు చెప్పుకునే హ్యాండ్లర్లతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని.. భారతదేశంలో ఐసిస్ తరపున పనిచేయడానికి వీరిద్దరిని నియమించినట్లుగా వర్గాలు తెలిపాయి. ఇద్దరిలో కూడా చాలా తీవ్రవాద భావాలు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. సిరియాకు చెందిన ఐసిస్ హ్యాండ్లర్ అబు ఇబ్రహీం అల్-ఖురేషితో నిరంతరం కమ్యూనికేషన్‌లో ఉన్నారని.. అతని సూచనల మేరకు ఢిల్లీలో భారీ కుట్రలకు ప్లాన్ చేసినట్లుగా అధికారులు తేల్చారు.

ఇది కూాడా చదవండి: Maharashtra: డాక్టర్ ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు.. ఓ ఎంపీ ఏం చేశాడంటే..!

ప్రాథమిక విచారణలో నిందితుల్లో ఒకడు కీలక విషయాలు వెల్లడించాడు. సోషల్ మీడియా ద్వారా భోపాల్‌కు చెందిన వ్యక్తితో సంప్రదింపులు జరిపినట్లు తెలిపాడు. జిహాదీ సిద్ధాంతాలను ఆన్‌లైన్ ద్వారా షేర్ చేసినట్లు ఒప్పుకున్నాడు. ఇద్దరు ఉగ్రవాదులు కూడా విద్యావంతులని.. సాధారణ జీవితాలను గడుపుతున్నారని అధికారులు వెల్లడించారు. స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ వాడకంతో ఇద్దరు కూడా ఐసిస్‌కి ఆకర్షితులైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే దీపావళి సమయంలో ఢిల్లీ భారీ దాడులకు కుట్ర పన్నినట్లుగా కనుగొన్నారు. ఢిల్లీలో రద్దీగా ఉండే ప్రాంతంలో ఒక ప్రముఖ మాల్ లేదా ఒక పబ్లిక్ పార్కును లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద దాడి చేయడానికి కుట్ర పన్నినట్లుగా విచారణలో తేలింది.

ఇది కూాడా చదవండి: Osama bin Laden: ఆ సమయంలో లాడెన్ ఆడ వేషంలో తప్పించుకున్నాడు.. మాజీ సీఐఏ అధికారి వెల్లడి

Exit mobile version