High Court: భర్త, సహోద్యోగి మధ్య స్నేహం ‘‘వివాహేతర సంబంధమేనా’’..? భార్య ఆరోపణలపై హైకోర్ట్..
- భర్త, మహిళ మధ్య స్నేహం వివాహేతర సంబంధమేనా..?
- భార్య తప్పుడు ఫిర్యాదులపై కలకత్తా హైకోర్టు కీలక వ్యాఖ్యలు..
- మానసిక క్రూరత్వం కింద భర్తకు విడాకులు మంజూరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
High Court: భర్త తన సహోద్యోగితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని భార్య నిర్లక్ష్యంగా ఆరోపించడం మానసిక క్రూరత్వానికి సమానమే అని కలకత్తా హైకోర్టు చెప్పింది. స్త్రీ, పురుషుల మధ్య స్నేహాన్ని, నేటి సమాజంలో అక్రమ సంబంధంగా భావించలేము అని కోర్టు పేర్కొంది. క్రూరత్వం కారణంగా కుటుంబ కోర్టు తనకు విడాకులు మంజూరు చేయడానికి నిరాకరించడంతో భర్త (పిటిషనర్) హైకోర్టులో అప్పీల్ చేశారు. ఈ కేసుని విచారిస్తూ, హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
సహోద్యోగితో వివాహేతర సంబంధం ఉందంటూ భర్తపై భార్య తప్పుడు ఆరోపణలు మానసిక క్రూరత్వానికి సమానమే అని తీర్పు చెప్పింది. భార్య చేసిన నిరాధార ఆరోపణల కారణంగా విడాకుల కోసం భర్త అప్పీల్ చేసిన కేసుని జస్టిస్ సబ్యసాచి భట్టాచార్య, జస్టిస్ ఉదయ్ కుమార్‌లతో కూడిన డివిజనల్ బెంచ్ అనుమతించింది. భార్య చేసిన నిరాధారమైన ఆరోపణల కారణంగా ఇద్దరి వివాహ బంధం కోలుకోలేని విధంగా దెబ్బతిన్నట్లు తీర్పులో పేర్కొంది.
Also Read
- Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
- CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్‌పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
- Rahul Gandhi: ‘బాధ మీది.. డేటా మీది.. సంపద వాళ్లది’! కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
- UPI: యూపీఐ ఛార్జీలపై కేంద్రం కీలక ప్రకటన..సామాన్యులకు ఊరట..
Read Also: Ranveer Allahbadia: యూట్యూబర్ రణవీర్ అల్లాబాడియాపై ఎఫ్ఐఆర్ నమోదు..
స్నేహం కారణంగా మహిళా సహోద్యోగికి, భర్తతో సంబంధాన్ని అంటగట్టడం ఆమోదయోగ్యం కాదని, ఏ స్వతంత్ర సాక్షి కూడా ధ్రువీకరించని సందర్భంలో, ఆరోపణలు నిరాధారమైనవిగా భావించాల్సి ఉంటుందని కోర్టు చెప్పింది. హిందూ వివాహ చట్టం-1955 కింద కుటుంబ కోర్టు అంతకుముందు విడాకులకు నిరాకరించింది. ఎలాంటి ఆధారాలు లేకున్నా భార్య పదేపదే తప్పుడు ఆరోపణలు చేస్తోందని భర్త వాదించాడు. ఇది తనకు తీవ్రమైన మానసిక గాయాన్ని, సమాజంలో పరువుని తీసిందని చెప్పాడు. భార్య తనపై, తన కుటుంబంపై క్రిమినల్ కేసుల్ని పెట్టినట్లు కోర్టుకు తెలిపారు.
భార్య సాక్ష్యాలు అందించడంలో విఫలమైందని, సమాజంలో భర్త ప్రతిష్టని దెబ్బతీసినట్లు హైకోర్టు గుర్తించింది. భర్త దూరమైన ప్రతీసారి, తన వద్దకే రావాలని భార్య క్రిమినల్ ఫిర్యాదులను ఉపయోగిస్తున్నట్లు తేల్చింది. కుటుంబ న్యాయస్థానం ఈ కీలకమైన అంశాలను పరిగణలోకి తీసుకోలేదని, ఇలాంటి సరిదిద్దుకోలేని బంధాన్ని బలవంతం చేయడం సమర్థనీయం కాదని కోర్టు చెప్పింది. ఫ్యామిలీ కోర్టు తీర్పుని పక్కన పెట్టి, ఇద్దరి వివాహాన్ని రద్దు చేస్తూ, విడాకులు ఇచ్చింది.
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్‌కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
-
Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
-
Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!