Sambhal Violence: కోర్టు ఆదేశాలతో సంభల్‌లోని ఓ మసీదులో సర్వే.. చెలరేగిన అల్లర్లు, ఇంటర్నెట్ బంద్
- యూపీలోని సంభల్‌లో కోర్టు ఆదేశాల మేరకు ఓ మసీదులో సర్వే..
- నేడు సంభల్‌లో విద్యాలయాలకు సెలవులు ప్రకటించిన అధికారులు..
- సంభల్ పరిధిలో 24 గంటల పాటు ఇంటర్నెట్ సేవలు బంద్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sambhal Violence: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లా కేంద్రమైన సంభల్‌లో కోర్టు ఆదేశాల మేరకు ఓ మసీదులో సర్వే చేస్తుండగా ఆదివారం ఉదయం చెలరేగిన అల్లర్లలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. పట్టణంలో మొగల్ కాలానికి చెందిన జామా మసీదు ఉన్న చోట గతంలో హరిహర మందిరం ఉండేదన్న పిటిషను మేరకు స్థానిక న్యాయస్థానం సర్వేకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో గత మంగళవారం నుంచి సంభల్‌లో ఉద్రిక్తత కొనసాగుతుంది. నిన్న (ఆదివారం) పెద్ద గుంపుగా వచ్చిన కొందరు వ్యక్తులు సర్వేను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో పాటు మసీదు ముందు పెద్ద ఎత్తున నినాదాలతో ఆందోళన చేశారు. పోలీసుల పైకి రాళ్లు రువ్వి, వెహికిల్స్ కు నిప్పు పెట్టేందుకు యత్నించారు.
Read Also: IPL 2025 Auction: తొలిరోజు వేలం తర్వాత 10 జట్ల వద్ద మిగిలిన పర్సు విలువలు..
Also Read
- IMD Warning: ఎల్‌నినో వచ్చేసింది.. మాన్సూన్పై ఐఎండీ వార్నింగ్
- Sejal Pawar: డాక్టర్ అని చెప్పుకుంటూ చెత్త కూతలు కూసిన సెజల్ పవార్! అసలు రంగు బయటపెట్టిన కేఈఎమ్ హాస్పిటల్..
- Saayoni Ghosh: 17 ఏళ్లకే హీరోయిన్గా.. అనతికాలంలో ఎంపీగా.. ట్రెండింగ్‌గా మారిన సయానీ ఘోష్ కథేంటి?
- India summons US: అమెరికా దాడులపై భారత్ సీరియస్.. యూఎస్ దౌత్యవేత్తకు సమన్లు..
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లాఠీలు ఝళిపించి, బాష్పవాయువు, ప్లాస్టిక్ బుల్లెట్లు ప్రయోగించిన ఆ గుంపును చెదరగొట్టేందుకు ట్రై చేశారు. కొంత మంది దుండగులు ఇళ్ల నుంచి కాల్పులు జరపగా.. సర్కిల్ అధికారితో పాటు దాదాపు 20 మంది పోలీసులు గాయపడ్డారు. నిందితులను గుర్తించేందుకు యత్నిస్తున్నామని ఓ పోలీసు అధికారి చెప్పుకొచ్చారు. సంభల్ పరిధిలో 24 గంటల పాటు ఇంటర్నెట్ సేవలను బంద్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. 12వ క్లాస్ వరకు అన్ని విద్యాలయాలకు ఈరోజు (సోమవారం) సెలవు ఇచ్చారు. ఇద్దరు మహిళలు సహా 21 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.
తాజావార్తలు
-
IMD Warning: ఎల్‌నినో వచ్చేసింది.. మాన్సూన్పై ఐఎండీ వార్నింగ్
-
Sajjala Ramakrishna Reddy: రెండేళ్ల పాలనపై ప్రజల ఆగ్రహం బయటపడింది.. చంద్రబాబుకు ఇదే లాస్ట్ టర్మ్..!
-
Iran-US: ఇరాన్ మళ్లీ కొత్త మెలిక.. హార్ముజ్, యురేనియంపై కీలక వ్యాఖ్యలు
-
Sejal Pawar: డాక్టర్ అని చెప్పుకుంటూ చెత్త కూతలు కూసిన సెజల్ పవార్! అసలు రంగు బయటపెట్టిన కేఈఎమ్ హాస్పిటల్..
-
Clothes Drying Tips: వర్షాకాలంలో బట్టలు ఆరబెట్టడానికి కష్టపడుతున్నారా? ఈ సులభమైన చిట్కాలతో గంటల్లోనే డ్రై..!
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్‌ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!