Congress: ‘‘వినాశక దారిలో కాంగ్రెస్’’.. తమిళనాడు ఎంపీ జోతిమణి వార్నింగ్..
- తమిళనాడులో కాంగ్రెస్ వినాశక దారిలో వెళ్తోంది..
- పార్టీ ఎంపీ జోతిమణి సంచలన వ్యాఖ్యలు..
- బయటపడుతున్న కాంగ్రెస్ వర్గపోరు..
Congress: తమిళనాడులో కాంగ్రెస్ వర్గపోరు వీధిన పడింది. కాంగ్రెస్ కరూర్ ఎంపీ జోతిమణి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలోని ఒక వర్గంపై విమర్శలు గుప్పించారు. ‘‘ఒక వర్గం కాచుకుని కూర్చుని, ప్రజల మనోభావాలను రెచ్చగొట్టడానికి, అధికారాన్ని చేజిక్కించుకోవడానికి, ఈ గడ్డపై సామాజిక న్యాయం, అభివృద్ధి విధానాలను పాతిపెట్టడానికి ఏ అవకాశాన్ని అయినా ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉంది’’ అని ఆమె అన్నారు. ప్రజల సమస్యల గురించి వదిలిపెట్టి, వర్గపోరాటాల్లో నిమగ్నమై, తమిళనాడు కాంగ్రెస్ కొద్దిమంది స్వార్థ ప్రయోజనాల కోసం వినాశకర మార్గంలో పయనిస్తోందని ఆమె అన్నారు.
Also Read
- West Bengal: బెంగాల్ కురుక్షేత్రంలో గెలుపెవరిది? 2016లో 3 స్థానాలు, 2021 నాటికి 77 సీట్లు.. బీజేపీ మాస్టార్ ప్లాన్ పనిచేస్తుందా?
- Suvendu Adhikari: సనాతన ధర్మాన్ని కాపాడే ప్రభుత్వం వస్తోంది.. దేవుడు మాతోనే ఉన్నారు..
- Tamil Nadu Eections 2026: టీవీకే సంచలన నిర్ణయం.. విజయ్ ప్రత్యేక టీమ్‌లు.. తమిళ రాజకీయాల్లో ఉత్కంఠ
- Assam Assembly Election Results: హిమంత బిస్వా శర్మ 25 ఏళ్లుగా ఎమ్మెల్యేగా.. ఈసారి జలుక్‌బరి స్థానంలో ఎవరు గెలుస్తారు?
తమిళనాడు కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలు తీవ్ర ఆందోళనల్ని కలిగిస్తున్నాయని, రోజు రోజు రాష్ట్ర కాంగ్రెస్ తప్పుడు కారణాల వల్ల వార్తల్లో నిలుస్తోందని ఆమె ఆవేదన వ్యక్తపరిచారు. తమిళనాడు కాంగ్రెస్ పార్టీకి ఉన్న గుర్తింపు, గౌరవం నెహ్రూ గాంధీ కుటుంబాలు చేసిన త్యాగాల నుంచి వచ్చాయని, రాహుల్ గాంధీ నిస్వార్థ, నిర్భయ రాజకీయాలకు పూర్తి వ్యతిరేక మార్గంలో పయనిస్తోందని చెప్పారు. రాహుల్ గాంధీ అవిశ్రాంత కృషిని, సాటిలేని త్యాగాలను మనం మోసం చేయలేము అని ఆమె అన్నారు.
పార్టీ డేటా వింగ్ చీఫ్ ప్రవీణ్ చక్రవర్తి, తమిళనాడు అప్పుల్ని బీజేపీ పాలిత యూపీతో పోల్చడం వివాదాస్పదమైంది. డీఎంకే ఎంపీ కనిమొళి తమిళనాడు అభివృద్ధిలో దూసుకుపోతుందనే సోషల్ మీడియా పోస్టుపై చక్రవర్తి ఈ విమర్శలు చేశారు. తమిళనాడును, యూపీతో పోల్చడం అన్యాయమని జోతిమణి అన్నారు. దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ చక్రవర్తి కూడా స్పందించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ గొంతును కాంగ్రెస్ లోపల ఎవరూ వినిపించడానికి తాము అనుమతించమని అన్నారు. ఈ వివాదం కాంగ్రెస్-డీఎంకే మిత్రపక్ష సంబంధాలపై ప్రభావం చూపుతోంది. ఈ ఏడాది ఎన్నికలు జరగబోయే తమిళనాడులో బీజేపీ అవకాశంగా మార్చుకుని విమర్శలు చేస్తోంది.
తాజావార్తలు
-
Bengal Election Results Live Updates: బెంగాల్ బాద్‌షా ఎవరు? మమత హ్యాట్రిక్ కొడుతుందా? అప్‌డేట్స్ మీకోసం..
-
Tamannaah: విజయ్ వర్మతో బ్రేకప్ తర్వాత.. పెళ్లిపై తమన్నా క్లారిటీ..
-
Trisha Visits Tirumala: తమిళనాడు ఫలితాల ముందు తిరుమలలో హీరోయిన్ త్రిషా దర్శనం.. టీవీకే విజయానికి ప్రార్థనలు..?
-
West Bengal: బెంగాల్ కురుక్షేత్రంలో గెలుపెవరిది? 2016లో 3 స్థానాలు, 2021 నాటికి 77 సీట్లు.. బీజేపీ మాస్టార్ ప్లాన్ పనిచేస్తుందా?
-
Donald Trump: ట్రంప్ ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’ ప్రకటన.. హార్మూజ్‌లో చిక్కుకున్న ఓడలను సురక్షితంగా బయటకు..
-
Suvendu Adhikari: సనాతన ధర్మాన్ని కాపాడే ప్రభుత్వం వస్తోంది.. దేవుడు మాతోనే ఉన్నారు..
ట్రెండింగ్
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!