Site icon NTV Telugu

Indo-Pak tensions: ‘‘జమ్మూ కాశ్మీర్ వెళ్లొద్దు’’.. తన పౌరులకు యూఎస్, యూకే, కెనడా ఆదేశాలు..

Jk

Jk

Indo-Pak tensions: పహల్గామ్ ఉగ్రవాద దాడికి భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’తో ప్రతీకారం తీర్చుకుంది. బుధవారం తెల్లవారుజామున పాకిస్తాన్, పీఓకే లోని ఉగ్రవాద శిబిరాలను టార్గెట్ చేస్తూ మిస్సైల్ అటాక్ నిర్వహించింది. ఈ దాడిలో 100 మందికి పైగా లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాడులు మరణించారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి.

Read Also: Bomb Threat : జైపూర్‌లో హైఅలర్ట్‌.. సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియంకు బాంబు బెదిరింపు

ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్ సహా అనేక దేశాలు వారి పౌరులకు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశాయి. జమ్మూ కాశ్మీర్‌కి వెళ్లొద్దని ట్రావెల్ అడ్వైజరీని జారీ చేశాయి. న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం, తమ పౌరులు సంఘర్షణ ప్రాంతాలను విడిచిపెట్టాలని భద్రతా హెచ్చరికలు జారీ చేసింది. పరిణామాలను నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొంది. దీనికి ముందు, భారత్-పాక్ సరిహద్దు, ఎల్ఓసీ వద్దకు ప్రయాణాలు చేయవద్దని పాకిస్తాన్‌లోని యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ఒక ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది.

ఉగ్రవాదం, పౌర అశాంతి, కిడ్నాప్, ఆకస్మిక హింస ముప్పును పేర్కొంటూ జమ్మూ కాశ్మీర్, భారత్ పాక్ సరిహద్దుల నుంచి 10 కి.మీ పరిధిలోని ప్రాంతాలకు ప్రయాణించవద్దని యూకే విదేశాంగ కార్యాలయం తన పౌరులకు సూచించింది. సింగపూర్ కూడా ఇదే తరహా సూచనల్ని చేసింది.

Exit mobile version