Site icon NTV Telugu

IndiGo Chaos: 500 కిలోమీటర్ల వరకు రూ.7,500.. ఇండిగో సంక్షోభం వేళా ఛార్జీలను ఫిక్స్ చేసిన కేంద్రం

Indigo Price

Indigo Price

IndiGo Chaos: ఇండిగో సంస్థ సంక్షోభం తీవ్రతరం కావడంతో దేశవ్యాప్తంగా పలు ఎయిర్ లైన్స్ విమాన టికెట్ ధరలు ఒక్కసారిగా పెంచేశాయి. దీంతో ప్రయాణికులపై తీవ్ర భారం పడటంతో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ సందర్భంగా ప్రయాణికులకు ఇబ్బంది కాకుండా ఈరోజు ( డిసెంబర్ 6న) కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఏ ఎయిర్‌లైన్ అయినా తాము విధించిన ధరలను తప్పనిసరిగా పాటించాల్సిందేనని కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే, UDF, PSF, ట్యాక్సులు మినహా, బిజినెస్ క్లాస్, UDAN పథకం విమానాలకు ఈ క్యాప్స్ వర్తించవు అని వెల్లడించింది.

Read Also: Kasuri – Masood: జైషే అగ్ర కమాండర్ల ‘రహస్య సమావేశం’.. భారత్‌పై భారీ కుట్రకు ప్లాన్!

అయితే, విమాన టికెట్ ధరల్లో ఎలాంటి పెరుగుదల కనిపించినా.. ప్రయాణికులను దోచుకునే విధంగా అధిక చార్జీలు వసూలు చేసినా.. సంబంధిత ఎయిర్‌లైన్‌పై తక్షణ చర్య తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. అలాగే, డిమాండ్ పెరిగిన రూట్లపై ఎయిర్‌లైన్లు అదనపు సర్వీసులు పెంచాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక, కొత్త FDTL (Flight Duty Time Limitation) నిబంధనల కారణంగా ఇండిగో విమానయాన సంస్థ భారీ ఆపరేషనల్ ఇబ్బందులను ఎదుర్కొంటోంది. దీని మూలంగా గత కొన్ని రోజుల్లో వెయ్యికి పైగా విమానాలు రద్దు అయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే దాదాపు 1000 విమానాలు రద్దు కావడం కలకలం రేపింది. దీంతో దేశవ్యాప్తంగా ఎయిరిండియా, స్పై్స్ జెట్ విమాన సంస్థలు చార్జీలను 3 నుంచి 4 రెట్లు పెంచేశాయి.

Read Also: PM Modi: ఇండిగో సంక్షోభంపై ప్రధాని మోడీ సమీక్ష..

కేంద్రం కొత్తగా విధించిన విమాన ధరలు..
* 500 కిలోమీటర్ల వరకు: రూ. 7,500
* 500–1000 కిలోమీటర్లు: రూ. 12,000
* 1000–1500 కిలోమీటర్లు: రూ. 15,000
* 1500 కిలోమీటర్లకు పైగా: రూ. 18,000

Exit mobile version