India-North Korea: “కిమ్” రాజ్యంతో దౌత్య సంబంధాలు.. జాగ్రత్తగా వ్యవహరిస్తున్న భారత్..
- ఉత్తర కొరియాతో దౌత్య సంబంధాలు తిరిగి ప్రారంభించిన భారత్..
- కోవిడ్-19 నేపథ్యంలో తగ్గిన దౌత్య సంబంధాలు..
- అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్న భారత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-North Korea: భారత్ తన యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగంగా తూర్పు దేశాలతో సంబంధాలు పెంచుకోవాలని అనుకుంటోంది. ఆగ్నేయాసియా దేశాలతో సంబంధాలు పెంచుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ‘‘కిమ్ జోంగ్ ఉన్’’ పాలనలో ఉన్న ఉత్తర కొరియాలోని భారత తన రాయబార కార్యాలయాన్ని తిరిగి తెరిచింది. ఉత్తర కొరియా చాలా అస్పష్టతతో పనిచేస్తున్న కారణంగా, భారత్ ఆ దేశంతో దౌత్య సంబంధాలను తగ్గించింది. జూలై 2021లో భారతదేశం ఉత్తర కొరియాతో తన రాయబార కార్యాలయాన్ని మూసేసింది. రాయబారి అతుల్ మల్హరీ గోట్సర్వేతో పాటు మొత్తం సిబ్బందిని మాస్కో మీదుగా ఢిల్లీకి తరలించారు.
అయితే, విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎంబసీని మూసివేసినట్లు అధికారికంగా ప్రకటించనప్పటికీ.. మొత్తం సిబ్బందిని వెనక్కి పిలిపించింది. కోవిడ్ -19 కారణంగా ఈ చర్య తీసుకుంటామని ప్రభుత్వం చెప్పింది. 14 నెలల క్రితం గోట్సర్వేని మంగోలియాకు కొత్త రాయబారిగా పోస్టింగ్ ఇచ్చింది. ఈ నెల ప్రారంభంలో భారతదేశం ప్యాంగ్యాంగ్తో తన రాయబార కార్యాలయంలో సాధారణ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. కొద్ది రోజుల్లోనే సాంకేతిక సిబ్బంది, దౌత్య సిబ్బందిని ఉత్తర కొరియాకు పంపబడింది.
Also Read
- Dimple Choudhary: ప్రముఖ డ్యాన్సర్‌తో అనుచిత ప్రవర్తన.. స్టేజ్‌పై కీచకుడి చెంపపగలగొట్టిన నర్తకి
- Vijay: విజయ్‌కు భారీ బూస్ట్.. టీవీకేలో చేరిన అన్నాడీఎంకే మాజీ మంత్రులు..
- Cooking Oil: 850, 900 గ్రాముల ప్యాకింగ్‌కు బ్రేక్.. వంట నూనెల దోపిడీపై కేంద్రం సంచలన నిర్ణయం..
- Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
Read Also: Bihar: ప్రేమలో పడ్డ ముగ్గురు పిల్లల తల్లి.. దగ్గరుండి పెళ్లి చేసిన భర్త!
ఒక నివేదిక ప్రకారం.. ఉత్తర కొరియాతో దౌత్య సంబంధాలపై భారత్ ఆచితూచి వ్యవహరిస్తోంది. ముఖ్యంగా గూఢచర్యంలో కిమ్ ప్రభుత్వం ప్రసిద్ధి. దీంతో రాయబార కార్యాలయంలోని ప్రతీ ఇంచు కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. మరో కొన్ని రోజుల్లో పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
ఇటీవల కాలంలో ఉత్తర కొరియా ప్రభావం పెరుగుతోంది. ముఖ్యంగా క్షిపణి అభివృద్ధిలో దూసుకువెళ్తోంది. హైపర్ సోనిక్ క్షిపణులు, వ్యూహాత్మక ఆయుధాలు, షార్ట్ అండ్ లాంగ్ రేంజ్ మిస్సైల్స్ సాంకేతికతపై వేగంగా పనిచేస్తోంది. ఉత్తర కొరియాలో భారత ఉనికి ఉండటం వల్ల ఇలాంటి సాంకేతికత పాకిస్తాన్ వంటి దేశాలకు చేరకుండా అడ్డుకోవచ్చు. గత కొన్నేళ్లుగా ఉత్తర కొరియా రష్యా, చైనా, ఇరాన్‌లతో సంబంధాలను పెంచుకుంది. ఈ కూటమి భారత్-అమెరికా-జపాన్-ఆస్ట్రేలియా దేశాల క్వాడ్ కూటమిని కౌంటర్ చేయడానికి ఏర్పడింది. దౌత్యపరంగా దీనిని ఎదుర్కోవడానికి భారతదేశాని ప్రాధాన్యత ఉంటుంది. రష్యా, ఇరాన్‌తో భారత్‌కి ఉన్న బలమైన సంబంధాలు కూడా ఉత్తర కొరియా విషయంలో భారత్‌కి సహాయపడనున్నాయి.
తాజావార్తలు
-
Rama Nandana: యూట్యూబర్స్ ‘గలీజ్ దందా’ స్కామ్.. రంగంలోకి దిగిన తెలంగాణ పోలీస్..
-
Dimple Choudhary: ప్రముఖ డ్యాన్సర్‌తో అనుచిత ప్రవర్తన.. స్టేజ్‌పై కీచకుడి చెంపపగలగొట్టిన నర్తకి
-
Hyderabad Rains : హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. జలమయమైన రోడ్లు..!
-
Vijay: విజయ్‌కు భారీ బూస్ట్.. టీవీకేలో చేరిన అన్నాడీఎంకే మాజీ మంత్రులు..
-
Cooking Oil: 850, 900 గ్రాముల ప్యాకింగ్‌కు బ్రేక్.. వంట నూనెల దోపిడీపై కేంద్రం సంచలన నిర్ణయం..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!