Corona Cases: భారీగా పెరిగిన కరోనా కేసులు.. నేడు కేంద్రం ఉన్నత స్థాయి సమావేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Corona Cases: ఇండియాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గతేడాది సెప్టెంబర్ తో పోలిస్తే మళ్లీ ఇప్పుడే గరిష్టంగా కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 6,050 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. నిన్నటి పోలిస్తే 13 శాతం ఎక్కువగా కేసులు వచ్చాయి. గత ఏడాది సెప్టెంబర్ 16 తర్వాత ఇప్పుడే తొలిసారిగా కేసుల సంఖ్య 6 వేలను దాటింది. నిన్న ఒక్క రోజే 14 మంది మరణించారు. దేశంలో ఇప్పటి వరకు కరోనా వల్ల 5,30,943 మరణించారు. మహరాష్ట్రలో ముగ్గురు, కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఇద్దరు చొప్పున ఢిల్లీ, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్ ఒక్కొక్కరు మరణించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Read Also: Covid 19: కరోనా కేసుల పెరుగుదలకు కారణం అవుతున్న XBB1.16 వేరియంట్.. లక్షణాలివే..
Also Read
- PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
- Rahul Gandhi: ఢిల్లీలో ఉద్రిక్తత.. రాహుల్ గాంధీ అరెస్ట్.!
- BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
- Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
దేశంలో పెరుగుతున్న కేసులకు XBB1.16 వేరియంట్ కారణం అవుతోంది. అయితే ఈ వేరియంట్ మరణించేంత ప్రభావం చూపించదు కానీ, దీర్ఘకాలిక వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారిపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రస్తుతం ఇండియాలో డైలీ పాజిటివీటీ రేటు 3.39 శాతంగా ఉంది. 28,303 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు 4.47 కోట్లు (4,47,45,104) కరోనా కేసులు నమోదు అయ్యాయి. మొత్తం ఇన్ఫెక్షన్లలో యాక్టివ్ కేసులు 0.06 శాతంగా ఉంది. కోవిడ్ రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది.
ఇదిలా ఉంటే పెరుగుతున్న కేసుల నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ నేడు అత్యున్నత సమావేశానికి పిలుపునిచ్చారు. ఈ రోజు మధ్యాహ్నం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య మంత్రులతో సమావేశం నిర్వహించనున్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు, ఐసీయూలు, ఆక్సిజన్ సౌకర్యాలపై చర్చించనున్నారు.
తాజావార్తలు
-
PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
-
UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
-
Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
-
Jim Jim Thara: జిమ్ జిమ్ తార.. నమ్మేలా ఉందా బాల?
-
Rahul Gandhi: ఢిల్లీలో ఉద్రిక్తత.. రాహుల్ గాంధీ అరెస్ట్.!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!