NTV Telugu Site icon

USA: భారత రాయబార కార్యాలయం వద్ద ఖలిస్తానీ మద్దతుదారుల ఆందోళన.. భారత జర్నలిస్టుపై దాడి..

Usa 2

Usa 2

Indian journalist attacked Khalistani supporters: ఖలిస్తానీ వేర్పాటువాద నేత అమృత్ పాల్ సింగ్ ను పట్టుకునేందకు పంజాబ్ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. గత తొమ్మిదిరోజులుగా అతను తన రూపాన్ని మార్చుకుంటూ తప్పించుకు తిరుగుతున్నాడు. ఇంత జరిగిన పంజాబ్ ప్రశాంతంగా ఉంది. అయితే విదేశాల్లో ఉంటున్న రాడికల్ ఎలిమెంట్స్, ఖలిస్తానీ మద్దతుదారులు భారత రాయబార కార్యాలయాల ముందు ఆందోళన చేస్తున్నారు. ఈ వారం యూకే లండన్ లోని భారత హైకమిషన్ పై దాడి చేశారు.

తాజాగా అమెరికాలోని రాయబార కార్యాలయం ఖలిస్తానీ వేర్పాటువాదులు ఆందోళన చేశారు. అక్కడ వారి ఆందోళనల్ని కవర్ చేస్తున్న ఓ భారతీయ జర్నలిస్టుపై దాడికి పాల్పడ్డారు. భారత ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్రమోదీని దుర్భాషలు ఆడుతూ మాట్లాడారు. తనను తిడుతూ, దాడికి పాల్పడినట్లు జర్నలిస్ట్ లలిత్ ఝా తెలిపారు. తనను చెవిపై కొట్టరని జర్నలిస్ట్ పేర్కొన్నాడు. తనకు రక్షణ కల్పించి తన పనిలో సహకరించినందుకు అమెరికా సీక్రెట్ సర్వీస్‌కు లలిత్ ఆదివారం కృతజ్ఞతలు తెలిపారు.

Read Also: Earthquake: రాజస్థాన్‌లో భూకంపం..

శనివారం వాషింగ్టన్ లోని భారత రాయబార కార్యాలయం వద్ద ఆందోళన చేయడానికి డీసీ-మేరీల్యాండ్-వర్జీనియా రాష్ట్రాల నుంచి ఖలిస్తానీ మద్దతుదారులు వచ్చారు. ఇంగ్లీష్, పంజాబీలో భారత వ్యతిరేక నినాదాలు చేశారు. పంజాబ్ పోలీసులు మానవహక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. ఈ ఘటనకు ముందు శాన్ ప్రాన్సిస్కో, లండన్ లోని రాయబార కార్యాలయాలపై దాడులు చేశారు. భారత్ పంజాబ్ లో విద్వేషాలను రెచ్చగొడుతున్న రాడికల్ వేర్పాటువాది అమృత్ పాల్ సింగ్ కు మద్దతుగా..‘‘ఫ్రీ అమృత్ పాల్’’ అంటూ రాతలు రాశారు.

ఈ ఘటనపై రాయబార కార్యాలయం స్పందించింది. సీనియర్ జర్నలిస్టుపై దాడిని ఖండించింది. ఖలిస్తానీ వేర్పాటువాదులు సంఘ వ్యతిరేక విధ్వంస చర్యలకు పాల్పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు తప్పించుకు తిరుగుతున్న అమృత్ పాల్ సింగ్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధాలు పెట్టుకోవడంతో పాటు సొంత ఆర్మీని ఏర్పాటు చేసుకుని దాడులకు పాల్పడాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం నేపాల్ మీదుగా విదేశాలకు పారిపోయేందుకు అమృత్ పాల్ సింగ్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. దీంతో సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేశారు.